Asian Games 2023: ఆసియా క్రీడల క్రికెట్ లో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బంగ్లాదేశ్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. బంగ్లా నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. గైక్వాడ్ (40) నాటౌట్, తిలక్ వర్మ (55) నాటౌట్ చిన్న లక్ష్యాన్ని చాలా సునాయాసంగా ఛేదించారు. 


సాయి కిషోర్ నాలుగు ఓవర్ల కోటాలో 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, షాబాద్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో జాకర్ అలీ 24 పరుగులు కొట్టి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పర్వేజ్ హోసైన్ ఎమోన్ 23 పరుగులతో టాప్ 2 స్కోరర్ గా నిలిచాడు.


ఇవాళ ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో గెలిచే టీమ్ తో రేపు భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్న భారత్.. రజత పతకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.