This is the reason Why India Pakistan cricket match was the hottest ticket in sports: భారత్‌-పాక్‌(Ind Vs PAk) మ్యాచ్‌ అంటే ఎందుకు అభిమానులు ఎందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తారో వేల రూపాయలున్న టికెట్లను ఎందుకు కొంటారో... లక్షలు ఖర్చు చేసి విదేశాలకు వెళ్లి మరీ మ్యాచులను ఎందుకు చూస్తారో మరోసారి నిరూపితమైంది. భారత్‌-పాక్ మధ్య నిన్న జరిగిన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు సరిపోలేదు. ఊపిరి బిగపట్టి మరీ... మునివేళ్లపై నిలబడి మ్యాచ్‌ను చూశారు. బ్యాట్‌తో పంత్‌(Panth), అక్షర్‌ పోరాడుతున్నప్పుడు... బంతితో బుమ్రా (Bumrah)అద్భుతం చేసేటప్పుడు అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు. కేవలం రెండే బంతులు ఆడినా... ఆడిన తొలి బంతికే విరాట్‌ కోహ్లీ కొట్టిన కవర్‌ డ్రైవ్‌ చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. మొత్తానికి క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌... వర్తు వర్మ వర్తు... చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు వర్మ.



బుమ్రా నువ్వో అద్భుతం
 అసలే స్వల్ప లక్ష్యం. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పాక్‌ బ్యాటర్లు నింపాదిగా ఆడుతుండడంతో దాయాది సునాయసంగా గెలిచేలా కనిపించింది. ఈ మ్యాచ్‌ను ఆది నుంచి పాక్‌ నిలబడ్డ ప్రతీసారి ఆ జట్టును దెబ్బకొట్టింది బుమ్రానే. సిరాజ్‌, అర్షదీప్‌ బౌలింగ్‌లో పాక్ ఓపెనర్లు నిలబడ్డప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను బుమ్రా అవుట్‌ చేసిన బంతి అద్భుతం కాక మరేమిటి. అసలే నెమ్మదిగా ఉన్న పిచ్‌పై అనూహ్యమైన బౌన్స్ రాబట్టిన బుమ్రా.. బాబర్‌ను వలలో వేసుకున్నాడు. బ్యాట్‌ను తాకుతూ సెకండ్‌ స్లిప్పులోకి వెళ్లిన బంతిని సూర్యా భాయ్‌ అందుకున్న తీరు కూడా అద్భుతమే. స్లిప్పులో ముందుకు పడుతున్న బంతిని అందుకోవడం అంత తేలిక కాదు. అలాంటిది బంతిని చాలా సరిగ్గా అంచనా వేసిన సూర్యా... ముందుకు డైవ్‌ చేస్తూ మంచి క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్‌తో పాక్‌ పతనం ఆరంభమైంది.


ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ తాను వేసిన తొలి బంతికే వికెట్‌ తీసి పాక్‌ను మరో దెబ్బ కొట్టాడు. ఇక పాక్‌ గెలుపు ఖాయమని భారత అభిమానులంతా సిద్ధమైపోయారు. కారణం మహ్మద్‌ రిజ్వాన్‌. ఓ వైపు వికెట్లు పడుతున్నా... బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతున్నా రిజ్వాన్‌ అంత తేలిగ్గా వదలలేదు. అడపాదడపా భారీ షాట్లు ఆడి మ్యాచును ఏకపక్షంగా మార్చేలా కనిపించాడు. భారత బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్న రిజ్వాన్‌ను బుమ్రా అవుట్‌ చేసిన బంతిని చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. ఈ వికెట్టే మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిరిగేలా చేసింది. రిజ్వాన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో పాటు... 19వ ఓవర్లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్లో పాక్‌ 18 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే విజయం ఖాయం కావడంతో అర్ష్‌దీప్‌పై ఒత్తిడి లేకుండా పోయింది. చివర్లో పాక్‌ బ్యాటర్లు రెండు ఫోర్లు కొట్టినా అది విజయానికి సరిపోలేదు.


విన్ ప్రెడిక్టర్..క్రికెట్ మ్యాచుల్లో మ్యాచ్ ఎవరి వైపు ఉందో..ఎవరికి విజయ అవకాశాలు ఉండే ఛాన్స్ ఎంత ఉందో చెప్పటానికి బ్రాడ్ కాస్టర్స్ వేసే అంచనా అన్న మాట ఇది. అయితే ఇలాంటి అంచనాలు టీమిండియా పాకిస్థాన్ మ్యాచుల్లో పెట్టుకోకపోవటం బెటర్. ప్రత్యేకించి వరల్డ్ కప్ మ్యాచుల్లో. ఎందుకో తెలుసా నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 120 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చింది. పాకిస్థాన్ బ్యాటింగ్ కి దిగేప్పటికి వాళ్ల విన్ ప్రెడిక్టర్ దాదాపుగా 85శాతం మనది కేవలం 15శాతం. అది ఆ తర్వాత 8 శాతానికి పడిపోయింది. అంటే 92శాతం ఈ మ్యాచ్ గెలవటానికి పాకిస్థాన్ కే ఛాన్స్ ఉందని అర్థం అన్నమాట. అలాంటి టైమ్ లో వచ్చాడు జస్ ప్రీత్ బుమ్రా.


పరుగులు ఆపేస్తూ..వికెట్లు లేపేస్తూ పాకిస్థాన్ పై ప్రళయ తాండవమే చేశాడు. ఫలితం 8పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ అని ప్రెడిక్టర్ చూపించిన టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇది ఇప్పుడే కాదు 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్పులోనూ అంతే. పాకిస్థాన్ పెట్టిన టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో టీమిండియా వికెట్లు కోల్పోతే..కింగ్ విరాట్ కొహ్లీ చిరుతపులిలా వేటాడుతాడు. అప్పుడు కూడా అంతే భారత్ కు విన్ ప్రెడిక్షన్ కేవలం 15శాతం..పాకిస్థాన్ కు 85శాతం ఉంటే..విరాట్ కొహ్లీ బీభత్సానికి మ్యాచ్ భారతే గెలిచింది. సో ఈ రెండు విజయాలు చూసిన తర్వాత ఫ్యాన్స్ అదే అంటున్నారు. విన్ పర్సెంటేజ్ పర్సెంటా అర పర్సెంటా కాదన్నాయా పాకిస్థాన్ తో మ్యాచ్ అయితే చాలు నీ ప్రెడిక్టర్ ను పిండేస్తాం క్రష్ చేస్తాం భారత్ దే పక్కా విక్టరీ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.