Sanjay Bangar Son Aryan:అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్‌ కుమారుడు- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Sanjay Bangar Son: ప్రముఖ ఇండియన్ మాజీ క్రికెటర్ కుమారుడు తన జెండర్ మార్చుకున్నాడు. ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు.

Continues below advertisement

Sanjay Bangar Son Aryan Harmone Replacement Therapy:  సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ అమ్మాయిగా మారిపోయారు. ఆపరేషన్ చేయించుకొన్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. తన 10 నెలల హార్మోన్ల మార్పిడిని సోషల్ మీడియాలో వివరించారు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా నుంచి వీడియోను డిలీట్ చేసారు. 

Continues below advertisement

మాజీ టీం ఇండియా ఆటగాడు, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ జెండర్ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో 23 ఏళ్ల ఆర్యన్ తన చిత్రాలను పంచుకున్నారు. భారత మాజీ కెప్టెన్లు MS ధోనీ, విరాట్ కోహ్లీతోపాటు తన తండ్రి బంగర్‌తో ఉన్న చిత్రాలను కూడా పంచుకున్నారు. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తర్వాత చిత్రాలను కూడా షేర్ చేశారు. హార్మోన్ల మార్పిడి తర్వాత తన పేరును కూడ ఆర్యన్ నుంచి కాకుండా అనయగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 

ఆర్యన్/అనయ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

ఆర్యన్/అనయ తన తండ్రిలానే క్రికెటర్. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నివసిస్తూ అక్కడే క్రికెట్ ఆడతున్నారు. పెద్ద మ్యాచ్‌లో అడకపోవడంతో లైమ్‌లైట్‌లోకి రాలేదు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వివరాలు చూస్తే మాత్రం ఎడమ చేతి బ్యాటర్‌గా తెలుస్తోంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తర్వాత క్రికెట్ కెరీర్ పూర్తిగా అగిపోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు ట్రాన్స్‌ ఉమెన్‌కు సంబంధించి నియమాలు, నిబంధనలు లేకపోవడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన తెలుస్తోంది. 

Also Read: ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్​లు ఇవే

ఆగస్టు 23న అనయగా ఆర్యన్ మారారు. ఇలా మారిన తర్వాత క్రికెట్‌ను గుడ్‌బై చెప్పడం చాలా బాధగా ఉందన్నారు. తన తండ్రిలాగే తాను కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు రాశారు. " చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తూ పెరిగాను నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను. మా నాన్న దేశానికి ప్రాతినిధ్యం వహించడం, కోచ్‌గా రాణించడం నేను చూస్తూనే ఉన్నాను. నేను ఆ అడుగుజాడల్లో నడవాలని కలలుకన్నాను. ఆట పట్ల ఆయనకున్న అభిరుచి, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. క్రికెట్ నా ప్రేమ, నా ఆశయం, నా భవిష్యత్తుగా భావించాను. నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నా జీవితమంతా గడిపాను. ఏదో ఒక రోజు ఆయనలా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశించాను."

ఆయన ఇలా రాసుకొచ్చారు. "“నాకు ఇష్టమైన, అతిగా ప్రేమించే క్రీడను వదిలివేయవలసి ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ బాధాకరమైన వాస్తవాన్ని ఫేస్ చేస్తున్నాను. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టి) చేయించుకోవడం ద్వారా నేను ట్రాన్స్ ఉమెన్‌గా మారినప్పటి నుంచి నా శరీరంలో చాలా మార్పు వచ్చింది. నా కండరాలు, బలం, కండరాల జ్ఞాపకశక్తి, అథ్లెటిక్ సామర్ధ్యాలు కోల్పోతున్నాను. నేను చాలా కాలంగా ప్రేమించిన ఆట నా నుంచి జారిపోతోంది.

Also Read: భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం

Continues below advertisement