IND vs SA: భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం

IND vs SA 2nd T20: రెండో T20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడు సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి.

Continues below advertisement

IND vs SA 2nd T20 Match Highlights: దక్షిణాఫ్రికాలో భారత్‌ రెండో మ్యాచ్‌ ఓటమి పాలైంది. రెండో T20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా సమం చేసింది. తక్కువ స్కోరు మ్యాచ్‌ అయినా అఖరి వరకు ఉత్కంఠగా సాగింది. 

Continues below advertisement

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేసింది. ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆఫ్రికాకు మంచి విజయాన్ని అందించారు. 

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టులో 4 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో సున్నా స్కోరు వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 4 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ వర్మ మంచి ఆరంభమే అందినా... కానీ 20 పరుగులను పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. అందరిలో హార్దిక్ పాండ్యా ఒక్కడే అత్యధిక పరుగులు చేశాడు. కానీ 45 బంతులు ఆడిన హా‌ర్దిక్ పాండ్యా 39 పరుగులు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 

భారత్ విజయాన్ని లాగేసుకున్న బౌలర్ 
125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్కోరు 44 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలా జట్టు 86 పరుగుల స్కోరు వచ్చే సమయానికి 7 మంది బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. 

అంతటితో సౌతాఫ్రికా పని అయిపోయిందని అనుకున్నారంతే అక్కటే అసలైన మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ అద్భుతంగా రాణించారు. 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అజేయంగా నిలిచారు. ఆఫ్రికన్ జట్టు విజయ తీరాలకు చేర్చారు. మంచి బౌలర్‌గా గుర్తింపు పొందిన కోట్జీ బ్యాటింగ్‌లోను అదరగొట్టాడు. చివరి 9 బంతుల్లో 19 పరుగులు చేసి తన జట్టు విజయానికి పెద్ద సహకారం అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా 
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో రెండుసార్లు ఈ ఘనత సాధించారు. యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్‌లు టీ20 మ్యాచ్‌ల్లో ఒక్కోసారి 5 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో వరుణ్ శ్రమ ఫలించలేదు. భారత్ మ్యాచ్ ఓడిపోయింది. 

ఓటమికి ఎవరినీ బాధ్యులను చేయలేమన్నారు సూర్య. పేలవ బ్యాటింగ్ ఓటమికి అతిపెద్ద కారణమని పేర్కొన్నాడు. అయితే ఇదే కాకుండా బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు.
మ్యాచ్ తర్వాత, సూర్య మాట్లాడుతూ, "మీరు ఎన్ని పరుగులు చేసినా దాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. T20 మ్యాచ్‌లో 125 లేదా 140 పరుగులు మాత్రమే చేయాలని ఎవరూ అనుకోరు, కానీ మా బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం చూసి నేను గర్వపడుతున్నాను."

Also Read: ఐపీఎల్ మెగా వేలంలో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వీరే !

Continues below advertisement
Sponsored Links by Taboola