Rinku Singh Priya Saroj Get Engaged : భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. యూపీలోని లక్నోలో ఆదివారం క్రికెటర్, ఎంపీల నిశ్చితార్థం ఇరుకుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. రింకు సింగ్, ప్రియా సరోజ్ ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫస్ట్ వీడియో వచ్చేసింది. ఆ వీడియోలో రింకూ సింగ్, ప్రియా సరోజ్ జంట చేతులు పట్టుకుని నవ్వుతూ కనిపించారు.


ప్రియా, రింకుల నిశ్చితార్థానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ ల నిశ్చితార్థ వేడుకకు ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఎస్పీ ఎంపీ జయా బచ్చన్, ఇఖ్రా హసన్ వంటి వారు వస్తున్నారని, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఎస్పీ ఎమ్మెల్యే తెలిపారు.






క్రికెటర్ రింకూ సింగ్ వివాహం చేసుకునే అమ్మాయి ఎవరంటే..


రింకూ సింగ్ వివాహం చేసుకుబోయే అమ్మాయి మామూలు పర్సన్ కాదు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్. మచ్చిలిషెహర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 26 ఏళ్ల ప్రియా సరోజ్ దేశంలో అతిపిన్న వయసు కలిగిన ఎంపీలలో ఒకరు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత. మచ్చిలిషెహర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి సేవలు అందించారు. జూన్ 8న లక్నోలో ఎంగేజ్‌మెంట్, అనంతరం ఐదు నెలలకు వారణాసిలో నవంబర్ 18న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.