T20 World cup 2024 Group A team: జూన్ 2 ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏకంగా 20 జట్లు ప్రపంచకప్ కోసం తలపడున్న ఈ భారీ టోర్నమెంట్‌లో మొత్తం ఉన్న టీమ్స్ నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్A గ్రూప్ B గ్రూప్ c గ్రూప్ D. ఇందులో ఒక్కో గ్రూప్ లో ఉన్న జట్లు గురించి వాటి ఫర్ ఫార్మెన్సెస్ అండ్ ఇన్నింగ్స్ ఛాన్సెస్ గురించి చూద్దాం. ముందుగా గ్రూప్‌లో Aలో ఉన్న టీమ్స్ అండ్ వాటి విన్నింగ్ ఛాన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం.


గ్రూప్ A. ఈ టీమ్ లో మొత్తం ఐదు జట్లున్నాయి. మన ఇండియాతోపాటు దాయాది దేశం పాకిస్థాన్ ఈ గ్రూపులో పెద్ద టీమ్స్. ఇవి కాకుండా మూడు చిన్న టీమ్స్ ఉన్నాయి. ఐర్లాండ్, కెనడా, అండ్ హోస్ట్ కంట్రీ యూఎస్ఏ. 


1.ఇండియా
2007లో టీ20 వరల్డ్ కప్ అనే టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు మొట్ట మొదటిసారి ఈ వరల్డ్ కప్‌ను గెల్చుకుంది ఇండియానే. ధోని తొలిసారిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెప్టెన్‌గా వెళ్లిన టీమిండియా అన్ని పెద్ద జట్లకు షాకిస్తూ ఆ వరల్డ్ కప్ నెగ్గింది. ఆ తర్వాత చాలా సార్లు దగ్గర వరకూ వెళ్లినా ఎప్పుడూ మళ్లీ కప్పు గెలవలేదు. 2014లో ఫైనల్ దాకా వచ్చినా శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. సో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి 17సంవత్సరాలు అవుతోంది. 
ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎలా అయినా కప్పు కొట్టేయాలని కసితో ఉంది. బ్యాటింగ్‌లో హిట్ మ్యాన్‌తోపాటు విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ లాంటి స్టార్లపై పెద్దగా ఆశలు పెట్టుకుంది మన జట్టు. 


బౌలింగ్‌లో బుమ్రా,సిరాజ్ రాణించాలని...ఎక్కువగా ఆడేది స్పిన్ కి సహకరించే పిచ్‌లు కాబట్టి జడ్డూ, అక్షర్,కుల్దీప్ వీళ్లంతా తమ సెలక్షన్‌కు న్యాయం చేయాలని భావిస్తోంది. గ్రూపు A లో ఉన్న టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది. ఇక అందరూ ఆసక్తిగా చూస్తే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న ఆదివారం జరుగుతుంది. లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్ గుర్తుందిగా విరాట్ కొహ్లీ వీరవిధ్వంసంతో భారత్ జయభేరి మోగించింది. అలాంటి మ్యాచ్ మరోసారి పడితే ఫ్యాన్స్ కి పండగే.


2. పాకిస్థాన్
 టీమిండియా మొదటి వరల్డ్ కప్‌ను గెలిచిన తర్వాత రెండో ఎడిషన్ 2009లో జరిగింది. ఆ ఏడాది వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది పాకిస్థాన్. ఇక అంతే పాకిస్థాన్ కూడా మళ్లీ కప్ కోసం ఎదురు చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ అజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వానే వాళ్ల ప్రధాన బలం. ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్ కూడా రాణిస్తే వాళ్లకు బోనసే. బౌలింగ్ మాత్రం ఎప్పట్లానే బాగుంది. షాహిన్ అఫ్రీది, నసీమ్ షా లాంటి వాళ్లను జాగ్రత్తగా కాచుకోవాలి. షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్ స్పిన్ బాధ్యతలు తీసుకుంటారు. వీళ్లకు కూడా ఈ గ్రూపులో ప్రధాన ప్రత్యర్థి టీమిండియానే. జూన్ 9న మ్యాచ్ జరిగే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం వీళ్లు కూడా ఎదురు చూస్తున్నారు. 


3. ఐర్లాండ్
చూడటానికి చిన్న టీమ్‌లా కనిపించే చిన్న టీముల్లో పెద్ద టీమ్ ఐర్లాండ్. ప్రత్యేకించి వరల్డ్ కప్పుల్లో బడా జట్లకు షాక్‌లు ఇవ్వటం ఐర్లాండ్‌కి అలవాటు. వరుసగా ఎనిమిదో వరల్డ్ కప్పు ఆడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మిగిలిన చిన్న జట్ల మీద ఐర్లాండ్ డామినేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో. సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఐరిష్ టీమ్‌లో గతంలో కెవిన్ ఓబ్రియాన్ లాంటి స్టార్ బ్యాటర్లు ఉండేవారు. ఈసారి అంతా కొత్త వాళ్లే కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో జోష్ లిటిల్ కొంచెం పేరున్న ఆటగాడు. టీమిండియాతోనే వీళ్ల తొలి మ్యాచ్ ఈనెల 5న జరగనుంది.


4. USA
 బంగ్లాదేశ్ మీద 2-1 తేడాతో టీ20 సిరీస్ నెగ్గి తామేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో ఈ వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది అమెరికా. పైగా హోస్ట్ కంట్రీ హోదాలో సొంత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతుండటం వాళ్లకు మరింత అడ్వాంటేజ్. 2004 నుంచి ఐసీసీ ఈవెంట్లు ఆడుతున్న USA టీ20వరల్డ్ కప్ ఆడటం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఎక్కువగా భారత్, పాకిస్థాన్ సంతతి ఆటగాళ్లతో నిండిపోయిన అమెరికా టీమ్‌ను మోనాక్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కొరే ఆండర్సన్ ఇప్పుడు USAకి ఆడుతున్నాడు. సో అతను USA టీమ్ కి ప్రధాన బలం.


5. కెనడా
ఎప్పుడో 1979లో తొలి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడిన కెనడా ఆ తర్వాత 2003, 2007, 2011 వరల్డ్ కప్పుల్లో ఆడింది. టీ20 వరల్డ్ కప్ ఆడటం మాత్రం అమెరికాలానే ఇదే ఫస్ట్ టైమ్. సాద్ బిన్ జాఫర్ కెప్టెన్సీ చేస్తున్న కెనడా టీమ్‌లోనూ భారతీయ మూలాలు ఉన్న ఆటగాళ్లే కనిపిస్తున్నారు. కెప్టెన్ సాద్ బిన్ జాఫరే ఈ టీమ్‌లో కీలక ఆటగాడు.