India vs England: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో టీమ్ఇండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రపంచ కప్‌లో భారత్‌తోపాటు ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈసారి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌ టీమ్‌తో తలపడనుంది. నవంబర్ 10న(గురువారం) అడిలైడ్ ఓవల్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.


టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు గతంలో కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ఆడింది. ఇంగ్లండ్‌పై భారత్‌ రికార్డు బాగానే ఉంది. ఇప్పటి వరకు జరిగిన టి20 ప్రపంచ కప్‌లలో భారత, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఉన్న రికార్డులు ఓసారి చూద్దాం. 


ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియాకే ఎడ్జ్ 


టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండుసార్లు ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఒక మ్యాచ్‌కు ఇంగ్లండ్ గెలిచింది. 


2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్... స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన ఒక ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. చిరస్మరణీయమైన, చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.


2009లో టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్, భారత్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు పైచేయి సాధించింది. 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.


2012లో ఇంగ్లండ్‌, భారత జట్ల మధ్య మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 90 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2009 టీ20 ప్రపంచ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 


టీ20 వరల్డ్‌కప్‌ 2022లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ జట్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడటం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఒక్కసారి కూడా నాకౌట్ మ్యాచ్ జరగలేదు.