ICC Champions Trophy 2025 Live Upadates: క్రికెట్లో అత్యంత విజయవంతమైన జట్టు అయినప్పటికీ చాాలామందికి ఆస్ట్రేలియా అంటే ఇష్టం ఉండదు. ఎలాగైనా గెలవాలనే తపనతో కొన్నిసార్లు అడ్డదారులు కూడా తొక్కుతారు. దీంతో వారు సాధించిన విజయాలపై మిగతా క్రికెట్ ప్రపంచంలో అంతగా ప్రశంసలు రావు. ఫీల్డులో కన్నింగ్ గా ఉంటారనేది ఆసీస్ టీమ్ ఉన్న ప్రధాన ఆరోపణ. గతంలో ఎన్నోసార్లు ఇది నిరూపితమైంది. ఎలాగైనా సరే గెలవాలని ఇలా ప్రవర్తిస్తుంటామని ఆయా క్రికెటర్లు కూడా బహిరంగంగా సమర్థించుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఎదురైంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్గానిస్థాన్ ప్లేయర్ ను అన్యాయంగా రనౌట్ చేయాలని భావించిన కంగారూ వికెట్ కీపర్ కు తన జట్టు కెప్టెన్ నుంచే తిరస్కారం ఎదురైంది. లాహోర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఈ ఘటన ఎదురైంది. ఆఫ్గాన్ బ్యాటర్ నూర్ అహ్మద్ పరుగు తీసి, స్ట్రైకర్ పొజిషన్ కు వచ్చాడు. అయితే అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. అయితే అప్పటికింకా, బాల్ వికెట్ కీపర్ చేతుల్లోకి రాలేదు. క్రీజును నూర్ వదిలిన మరుక్షణమే ఆసీస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీస్ వికెట్లను గిరాటేశాడు. ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఇక్కడే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన పని అభిమానుల మనసు దోచుకుంది.
సమయస్పూర్తి చాటిన స్మిత్..
నిజానికి నూర్ మరో రన్ కోసం ప్రయ్నతించలేదు. క్యాజువల్ గా అలా క్రీజు నుంచి ముందుకు రెండు అడుగులు వేశాడు. ఇది గమనించిన స్మిత్.. ఔట్ అప్పీల్ ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో వివాదానికి ఆదిలోనే ముగింపు పడింది. ఏదేమైనా ఇలా తిక్కగా వ్యవహరించడం సరికాదాని నెటిజన్లు ఇంగ్లీస్ ను ట్రోల్ చేస్తున్నారు. మెరిట్ ప్రకారం ఆడి గెలవాలని ఇలా చీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరో రన్ తీయాలనే ఉద్దేశం నూర్ కు లేదని, అలాంటిది అతడిని రనౌట్ ఎందుకు చేయాలని ప్రయత్నించావని అతడికి చీవాట్లు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఆసీస్ నేరుగా సెమీస్ కు చేరుకుంది. శనివారం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై మరో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా, రద్దయినా సౌతాఫ్రికా నాకౌట్ కు చేరుతుంది. అలాగే 207 పరుగుల కంటే తక్కువగా మార్జిన్ తో ఓడినా సెమీస్ లోకి ప్రవేశిస్తుంది.
స్మిత్ అసంతృప్తి..
ఇక వర్షం వల్ల మ్యాచ్ రద్దవడంపై స్మిత్ అన్ హేపీ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ సాధికుల్లా అటల్ (85) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో బెన్ డ్వార్షియస్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఆసీస్ 12.5 ఓవర్లలో 109-1 వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ రద్దయ్యింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు ఫిఫ్టీ (40 బంతుల్లో 59 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్)తో సత్తా చాటాడు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశామని, హెడ్ ఇన్నింగ్స్ తో తమకే విజయవకాశాలు చాలా ఉన్నాయని స్మిత్ పేర్కొన్నాడు. ఏదేమైనా మ్యాచ్ కారణంగా రద్దు కావడం నిరాశ కలిగించిందని, మొత్తానికి సెమీస్ చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. సెమీస్ లోనూ సమష్టి ఆటతీరును ప్రదర్శించి ఫైనల్ కు చేరుతామని ధీమా వ్యక్తం చేశాడు.