Sania Mirza : టెన్నిస్(Tennis) స్టార్ సానియా మీర్జా(Sania Mirza), పాకిస్థాన్(Pakistan) క్రికెటర్ షోయబ్ మాలిక్( Shoaib Malik )లు విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చాన్నాళ్లుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. సానియా తన ముద్దుల కుమారుడు ఇజాన్(Izhaan Mirza Malik) కలిసి దుబాయ్‌లో ఉంటుండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడు. విడాకులు తీసుకున్నారంటూ వస్తున్న వార్తలపై సానియా మీర్జా గానీ, షోయబ్ మాలిక్ గానీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు సానియా మీర్జా ఒక్క ఇన్ స్టా గ్రామ్ పోస్ట్‌తో విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. తామిద్దరం కలిసే ఉంటున్నామని... విడాకుల ప్రసక్తే లేదని వెల్లడించింది.
కుమారుడు ఇజాన్ పుట్టిన రోజు సందర్భంగా సానియా చేసిన ఇన్ స్టా పోస్ట్‌తో విడాకుల వివాదంపై స్పష్టత ఇచ్చింది. ‘నా చుట్టూ ఎంత చీకటిగా ఉన్నా, నీ చిరునవ్వుతో అంతా వెలుగుగా మారిపోతోంది. నా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో నువ్వు నాకు తెలియజేశావు. నా హృదయంలో నీకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. . అల్లాహ్ నిన్ను ఎల్లవేళలా ఆశీర్వదించును గాక’ అని కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చింది సానియా. తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్‌లో ఆమె ఎప్పుడూ తనను తాను తిరిగి ఎంచుకుంటుంది.. తనను తాను మళ్లీ కలిసి ఉంచుతుంది అని సానియా మీర్జా పోస్ట్ చేసింది. ఆమె ఎప్పుడూ బాగానే ఉంటుంది.. ఆమె పడిపోతుంది.. మళ్లీ పైకి లేస్తుంది.. ఆమె ఎప్పుడూ తనను తాను తిరిగి పైకిలేచేలా చేసుకుంటుంది.. ఎందుకంటే తన కోసం.. తన పిల్లల కోసం, ఆమె ఓడిపోవడానికి సిద్ధంగా ఉండదని సానియా మీర్జా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం సానియా షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరలవుతున్నాయి. అయితే సానియా మీర్జా షేర్ చేసిన ఫొటోల్లో ఎక్కడా షోయబ్ మాలిక్ కనిపించలేదు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో హైదరాబాద్(Hyderabad) వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి అయేషా ఉమర్(Ayesha Omar)తో మాలిక్ వివాహేతర సంబంధం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. సానియాతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అయేషా ఖండించింది. షోయబ్ ఒక మంచి స్నేహితుడంటూ క్లారిటీ ఇచ్చింది.
మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఈ స్టార్ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్ మీడియా సైతం ప్రచారం చేసింది. అయితే, ఈ వార్తలపై మాలిక్ ఇప్పటికే స్పందించారు. అది మా వ్యక్తిగతమని, ఆ విషయాన్ని మాకు వదిలేయండి..’ అంటూ వ్యాఖ్యానించారు కూడా. దీంతో రూమర్స్ కు కాస్త బ్రేక్ పడింది.
అయితే షోయబ్ మాలిక్ తన ఇన్ స్టా గ్రామ్(Instagram) బయోలో కీలక మార్పు చేయడం ఈ ఊహగానాలకు మరింత ఊతమిచ్చింది. గతంలో తన బయోలో ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అని ఉండేది. అయితే, ఇప్పుడు దాన్ని మార్చేశాడు. సూపర్ వుమన్ సానియా మీర్జాకు భర్తను అన్న పదాన్ని తొలగించి.. ‘ఓ బిడ్డకు తండ్రి..’ అన్న పదాన్ని మాత్రమే అలాగే ఉంచాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.