Sachin Tendulkar's Daughter Sara Tendulkar: టీమిండియా దిగ్గజ ఆటగాడు, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి  సారా టెండూల్కర్‌ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టీమిండియా  ఆడే మ్యాచ్‌లకు వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సహాపరుస్తూ ఉంటుంది. కొంత‌కాలంగా  సారా టీమిండియా  స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మ‌న్ గిల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలు వ‌స్తున్నాయి. అవి నిజమేనన్నట్లుగా  గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సారా కేరింతలు కొడుతూ అతడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సారా పేరిట ఉన్న ఖాతాల్లో గిల్ పై ప్రేమ ఉన్నట్లు ప‌లు ఫోటోలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన సారా టెండూల్కర్‌ తొలిసారి స్పందించింది. 


తన పేరిట జరుగుతున్న దుష్ప్రచారంపై  సారా ఆవేదన వ్యక్తం చేసింది. అసలు తనకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో ఎలాంటి అకౌంటే లేదని స్పష్టం చేసింది. డీప్‌ ఫేక్‌ ఫొటోలతో కొంతమంది కావాలనే తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సారా ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరుతో ఎక్స్‌లో ఉన్న  అకౌంట్‌ ఫోటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. కొన్ని రోజులుగా ఈ నకిలీ అకౌంట్‌లో శుబ్‌మన్‌ గిల్‌ పట్ల ఆమెకు ప్రత్యేక శ్రద్ధగా ఉన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. సారా పేరిట ఉన్న ఆ నకిలీ ఎక్స్‌ ఖాతాలో గిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు.. అతడు అవుటైన సందర్భాల్లో బాధ పడుతున్నట్లు పోస్టులు పెట్టారు. ఇక మరో ఖాతాలో తన తమ్ముడు అర్జున్‌తో సారా ఉన్న ఫొటోల్లో గిల్‌ ముఖంతో డీప్‌ ఫేక్‌ చేసి వైరల్‌ చేశారు. ఎక్స్‌లో సారా పేరిట ఉన్న నకిలీ ఖాతాకు బ్లూటిక్ మార్క్ ఉండటంతో ఇదే సారా నిజమైన అకౌంట్ అని భావించి.. ఈ అంశమై మీడియా కథనాలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ నుంచి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సారా టెండూల్కర్ స్పందించింది. ఎక్స్‌లో తనకు అకౌంటే లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సారా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్‌ అకౌంట్లను వెంటనే తొలగించాలని ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌కు సారా విజ్ఞప్తి చేసింది. కొంతమంది సాంకేతికను దుర్వినియోగం చేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్‌ను నింపేస్తున్నారని, తనకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ ఫొటోలు తన దృష్టికి వచ్చాయని, అవన్నీ అవాస్తమని సారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.



 అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా వినోదం అందించాల్సిన అవసరం లేదన్న సారా... నమ్మకం, వాస్తవాల ఆధారంగా నడిచే సమాచార వ్యవస్థలను ప్రోత్సహిద్దామని ఇన్‌ స్టా పోస్ట్‌లో సారా పేర్కొంది.  తన పేరిట అసత్య ప్రచారం సాగుతోందని సారా వాపోయింది. తన పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా గిల్‌కు విషెస్ చెబుతున్నట్లుగా సారా టెండూల్కర్ పేరిట బ్లూటిక్ మార్క్ ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మన బాధలు, సంతోషాలు అలాగే రోజువారీ కార్యక్రమాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదిక అన్న సారా టెండూల్కర్‌.. దానిని ఇలా దుర్వినియోగం చేయడం సమంజసం కాదన్నారు. వినోదమనేది వాస్తవాలను పణంగా పెట్టేదిగా ఉండకూడదన్న ఆమె.. వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దామని నెటిజన్లకు సూచించింది.