కోట్ల మంది భారత (Bharat) అభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా(Austrelia) ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవిచూశాక విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకున్నారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తెలిపాడు.  కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఆ టైంలో భారత క్రికెటర్ల మొహాలు చూస్తే వాళ్లు ఎంత బాధ పడ్డారో స్పష్టంగా కనిపించింది. ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. అయితే, టీమిండియాకు అనుభవం ఉందని, భవిష్యత్తులో ఏం చేయాలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. 


ఓట‌మి త‌రువాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఏడుస్తూనే ఉన్నార‌ని, ఆ ఇద్ద‌రిని అలా చూడ‌డం మిగిలిన వారికి ఎంతో బాధ‌ను క‌లిగించింద‌న్నాడు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింద‌న్నాడు. ఎంతో అనుభ‌వం, నైపుణ్యం ఉన్న జ‌ట్టు మ‌న‌ది. ఖ‌చ్చితంగా క‌ప్పును ముద్దాడుతామ‌ని భావించిన‌ట్లు చెప్పాడు. ఇద్ద‌రు స‌హ‌జ సిద్ద‌మైన నాయ‌కులుగా  అని చెప్పాడు. ఆ ఇద్ద‌రూ కూడా ఆట‌గాళ్ల‌కు కావాల్సిన స్వేచ్చ‌ను ఇచ్చి వాళ్లు మ‌రింత మెరుగ్గా రాణించేలా కృషి చేశార‌న్నాడు.


ఫైనల్‌లో ఓటమి భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది.  ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏకంగా  డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్‌ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్‌ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. 


 

అలాగే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌(Kapil Dev) కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని కపిల్‌ తెలిపాడు. ఛాంపియన్స్‌లా ఆడారని... సగర్వంగా తల ఎత్తుకోండని సూచించారు. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదని... మీరెప్పుడో విజేతలుగా నిలిచారని గుర్తు చేశాడు. ఆటగాళ్ల ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్‌ కూడా క్రికెటర్లను  ఓదార్చాడు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో తనకు తెలుసని.... గెలుపు ఓటములన్నవి ఆటలో ఒక భాగమని అన్నాడు. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలని ఈ జట్టు ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చిందని సచిన్‌(Sachin) అన్నాడు.