INDIA vs South Africa Team India Squad: ఆస్ట్రేలియా టీ20 సిరీస్ తరువాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోంది. దక్షిణాఫ్రికాతో వారి గడ్డమీద టెస్టులు, వన్డేలు, టీ20 మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు సిరీస్ లకు టీమిండియా ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇందుకోసం సెలక్షన్ కమిటీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమైంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను ప్రకటించి అభిమానులను కన్ ఫ్యూజ్ చేశారు. టెస్టులకు రోహిత్ శర్మ, వన్డేలకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనుడగా, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తాడు. 


భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, 3 వన్డేలు, రెండు 2 టెస్టులు ఆడనుంది. వీటితో పాటు ఇండియా A, దక్షిణాఫ్రికా Aతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఒక ఇంటర్-స్క్వాడ్ 3 రోజుల మ్యాచ్‌లు  ఆడుతుందని బీసీసీఐ తెలిపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేలు, టీ20ల నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరారు. మహ్మద్ షమీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది. 






టెస్టుల కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లు వీరే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపన్), అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ కృష్ణ.






3 టీ20ల కోసం ఎంపిక చేసిన భారత ఆటగాళ్లు వీరే: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.






3 వన్డేలకు భారత ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్,  ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.


బడర్బన్ వేదికగా డిసెంబర్ 10న తొలి టీ20
పోర్ట్ ఎలిజబెత్ (Gqeberha) వేదికగా డిసెంబర్ 12న రెండో టీ20
జోహన్నెస్ బర్గ్ వేదికగా డిసెంబర్ 14న మూడో టీ20


వన్డేల షెడ్యూల్
జోహన్నెస్ బర్గ్ వేదికగా డిసెంబర్ 17న తొలి వన్డే
పోర్ట్ ఎలిజబెత్ (Gqeberha) వేదికగా డిసెంబర్ 19న రెండో వన్డే
పార్ల్ వేదికగా డిసెంబర్ 21న మూడో వన్డే


టెస్టుల షెడ్యూల్
సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు తొలి టెస్ట్
కేప్ టౌన్ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply