Ravichandran Ashwin Test Record: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. 12 పరుగుల వద్ద తేజ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ తన పేరు మీద ప్రత్యేకమైన రికార్డును రాసుకున్నాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో తండ్రీ కొడుకులిద్దరినీ అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. 2011లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తండ్రి శివనారాయణ్ చందర్‌పాల్‌ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత కొడుకును కూడా అవుట్ చేసి రికార్డు సృష్టించాడు.
టెస్టు ఫార్మాట్‌లో తండ్రీకొడుకుల ద్వయాన్ని ఔట్ చేసిన తొలి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. టెస్టు ఫార్మాట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన ఘనత ఇంతకు ముందు ఏ భారత బౌలర్ సాధించలేదు. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తండ్రి శివనారాయణ్ చందర్‌పాల్ వెస్టిండీస్ తరఫున ఆడిన లెజండరీ ఆటగాళ్లలో ఒకడు.
శివనారాయణ్ చందర్‌పాల్ వెస్టిండీస్‌కు టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. శివనారాయణ్ చందర్‌పాల్ వెస్టిండీస్ తరఫున 164 టెస్టు మ్యాచ్‌లు, 268 వన్డేలు, 22 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
శివనారాయణ్ చందర్‌పాల్ కుమారుడు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ గురించి చెప్పాలంటే ఈ ఆటగాడు ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇప్పటి వరకు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్‌కు అంతర్జాతీయ వన్డే, టీ20లు ఆడే అవకాశం రాలేదు.
వెస్టిండీస్ తరఫున ఆరు టెస్టులాడిన తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 453 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ ఆటగాడు ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీ, ఒక అర్థ సెంచరీ సాధించాడు. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ సగటు 45.3 గానూ, స్ట్రైక్ రేట్ 42.42గానూ ఉంది. టెస్టు ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 207 పరుగులుగా ఉంది.