Pat Cummins bagged a hat-trick: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్(Pat Cummins) చరిత్ర సృష్టించాడు. సూపర్ ఎయిట్(Super -8)లో భాగంగా బంగ్లాదేశ్(BA)తో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి రికార్టు సృష్టించాడు.ఆంటిగ్వాలో సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్ పోరులో బంగ్లాదేశ్‌ను ఆస్ట్రేలియా(Aus) కేవలం 140 పరుగులకే పరిమితం చేసింది. బంగ్లా బౌలర్లను క్రీజులో కుదురుకోనివ్వని కంగారు బౌలర్లు... పకడ్బందీ బౌలింగ్‌తో తక్కువ పరుగులకే పరిమితం చేసారు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన కమిన్స్... బంగ్లా బ్యాటర్లకు షాక్ ఇచ్చాడు. కమిన్స్‌తో పాటు ఆడమ్ జంపా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా కేవలం 140 పరుగులకే పరిమితమైంది.
హ్యాట్రిక్ ఇలా...
ఈ మ్యాచ్‌లో కమిన్స్ రెండు ఓవర్లలో వరుస బంతుల్లో మహ్మదుల్లా, మహిదీ హసన్, తౌహిద్ హృదయ్‌ల వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ 20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా ఓవరాల్‌గా ఏడో బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. బ్రెట్‌లీ తర్వాత హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. 18వ ఓవర్ చివరి రెండు బంతుల్లో మహ్మదుల్లా, మహేదీ హసన్ వికెట్లు తీసిన కమిన్స్. 20వ ఓవర్ తొలి బంతికి హృదయ్‌ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన ఏడో బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కమిన్స్ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. టీ 20 ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. టాంజిద్ హసన్‌ను అవుట్ చేసిన మరో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్... ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన లంక స్టార్ పేసర్ లసిత్ మలింగ రికార్డును అధిగమించాడు. స్టార్క్ తొలి ఓవర్‌లో టాంజిద్ హసన్‌ను అవుట్ చేసి ఈ ఘనత సాధించాడు.
పురుషుల టీ 20లో హ్యాట్రిక్ వీరులు
బ్రెట్ లీ(ఆస్ట్రేలియా) vs బంగ్లాదేశ్- కేప్ టౌన్ 2007
కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) vs నెదర్లాండ్స్, అబుదాబి, 2021
వనిందు హసరంగా (శ్రీలంక) vs సౌత్ ఆఫ్రికా, షార్జా, 2021
కగిసో రబడ (దక్షిణాఫ్రికా) vs ఇంగ్లాండ్, షార్జా,
2021 కార్తీక్ మెయ్యప్పన్ (UAE) vs శ్రీలంక, గీలాంగ్, 2022
జాషువా లిటిల్ (ఐర్లాండ్) vs న్యూజిలాండ్, అడిలైడ్, 2022
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) vs బంగ్లాదేశ్, ఆంటిగ్వా, 2024
టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్లు
బ్రెట్ లీ vs బంగ్లాదేశ్, కేప్ టౌన్, 2007
అష్టన్ అగర్ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2020
నాథన్ ఎల్లిస్ vs బంగ్లాదేశ్, మీర్పూర్, 2021
పాట్ కమ్మిన్స్ vs బంగ్లాదేశ్, ఆంటిగ్వా, 2024