Pat Cummins: ఐపీఎల్‌(IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్(Srh) జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌(Pat Cummins) ఒక ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భారతీయ అభిమానులు తమ ఆసుపత్రి బిల్లులను తన అడ్రస్‌కు పంపుతున్నారని పాట్ కమిన్స్‌ ఆ ఇంటర్య్వూలో చెప్పాడు. తరచుగా భారతీయ అభిమానులు ఆపరేషన్లు, ఇతర చికిత్సల కోసం డబ్బు సాయం చేయాల్సిందిగా తనకు మెసేజ్‌లు పంపుతున్నారని అన్నాడు. ఇది చాలా అసాధారణమని, తనను కలవరపెడుతోందని కమిన్స్‌ వివరించాడు. కమిన్స్ ఈ మాటల్లో ఎక్కడా  బెగ్గర్ అన్న మాట వాడకపోయినప్పటికీ దానిని స్మితీ పేరుతో వీడిోయను షేర్ చేసి , కమిన్స్  ఇండియన్స్ ను బెగ్గర్స్ అన్నాడు అన్న క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియొ వైరల్ గా మారటంతో భారతీయ అభిమానులు మండిపడుతున్నారు. 






కమిన్స్‌కే ఎందుకు? 


కొవిడ్ మహమ్మారి భారత్‌లో విజృంభించిన సమయంలో పాట్ కమిన్స్‌ 50 వేల డాలర్లు పీఎం కేర్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. భారత్‌లో కొవిడ్ సమయంలో ఆక్సిజన్‌ కొరత బాగా ఉండేది. ఆక్సిజన్‌ దొరక్క అనేక మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్‌ సిలెండర్లు కొనేందుకు పాట్ కమిన్స్‌ పీఎం కేర్ ఫండ్‌కు 50 వేల డాలర్లు విరాళం ఇచ్చాడు. ఆకారణంతోనే భారతీయులకి దగ్గరివాడుగా మారి ఉండవచ్చు. కొవిడ్‌కు సాయం చేసిన అతడి పెద్ద మనుసును చూసే అభిమానులు సాయం కోరినట్లు భావించవచ్చు.


పాట్ కమిన్స్‌ పట్టిందల్లా బంగారం: 


పాట్ కమిన్స్‌ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమితుడైనప్పటి నుంచి అతడు పట్టిందల్లా బంగారంగా మారింది. అతడి సక్సెస్ రేటు బాగా పెరిగింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కెప్టెన్‌గా అతడికే ఘనత దక్కింది. వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడంలో అతనికే క్రెడిట్ దక్కింది. ఐపీఎల్ 2024కు ముందు నిర్వహించిన మినీ వేలంలో 20 కోట్ల 50లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. వెంటనే అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కమిన్స్‌ హైదరాబాద్‌ను ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు. అయితే ఫైనల్లో మాత్రం సన్‌రైజర్స్ విజయం సాధించలేకపోయింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 17 వికెట్లు పడగొట్టిన కమిన్స్‌ 2010 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చిన కమిన్స్‌కు భారీ సంఖ్యలో అభిమానులు పెరిగారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఆసుపత్రి బిల్లుల కోసం సాయం అడిగినట్లు అతడే చెప్పాడు. కొవిడ్‌కు సాయం చేసిన అతడి పెద్ద మనుసును చూసే అభిమానులు సాయం కోరినట్లు భావించవచ్చు. 


కమిన్స్‌ ఇంటర్వ్యూ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ నెటిజన్‌ భారతీయులను పాట్ కమిన్స్‌ బెగ్గర్స్ అంటున్నాడని రాసుకొచ్చాడు. కమిన్స్‌ భారతీయులను బెగ్గర్స్ అని డైరెక్ట్ గా అనకపోయినా వివాదాస్పదంగా రాసిన ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్‌లో ఆడుతూ కోట్లు సంపాదిస్తూ భారతీయులను బెగ్గర్స్ అనడం సరికాదని విమర్శిస్తున్నారు. ఐపీఎల్‌లోకి తీసుకోవాలని కమిన్సే బీసీసీఐ వెంటపడ్డాడని, ఆస్ట్రేలియా ఆటగాళ్ల అందరూ ఐపీఎల్‌ ద్వారా వచ్చే సంపాదన కోసం ఆరాటపడుతున్నారని భారత నెటిజన్లు  దుయ్యబడుతున్నారు.