Pak Fan sad after India Win: టీ 20 ప్రపంచకప్(T20 World Cup )లో భారత్(Team India) జైత్రయాత్ర సంగతమేమో గానీ పాక్ మాత్రం బలైపోయింది. టీ20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య లో జరిగిన ఈ స్కోరింగ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగింది. కానీ పాపం లక్షలు పెట్టి టికెట్టు కొన్న పాక్ అభిమానులకి మాత్రం తెగ బాధ పడిపోయారు. ఈ మ్యాచ్ కోసం ఓ పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్ టికెట్ కోసం తన ట్రాక్టర్‌నే అమ్మేశాడు. కానీ దానికి ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాక్ చివరి వరకు పోరాడి.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడింది. అనూహ్యమైన ఈ ఓటమితో పాకిస్తాన్ ఫాన్స్ మాత్రమే కాదు.. పాపం ప్లేయర్స్ కూడా కన్నీటిపర్యంతం అయ్యారు.
న్యూయార్క్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో మ్యాచ్ ల టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే అభిమానులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ఖరీదు అయితే తక్కువేం కాదు. అభిమానులు వేల డాలర్లు పెట్టి టికెట్ తీసుకుని మ్యాచ్‌ను తిలకించారు. ఒకటి రెండుసార్లు వర్షం మ్యాచ్‌కి అడ్డంకి కలిగించినా.. అదే ఉత్సాహంతో మ్యాచ్ చూశారు. లో స్కోరింగ్‌లో కూడా అద్భుత విజయం సాధించడంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే పాక్ అభిమానులు మాత్రం పాపం దేబ్బైపోయారు. పాపం ఒక అభిమాని తన మ్యాచ్ టికెట్‌ను కొనేందుకు తన ట్రాక్టర్‌ను అమ్మేశానని చెప్పాడు. 3వేల డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 2 లక్షల రూపాయలకు పైనే ఖర్చు పెట్టాడట. గట్టి బౌలింగ్ చేసి పాకిస్తాన్ అదరగొట్టిందని, భారత్ తమ టీం కు తక్కువ టార్గెట్ ముందుంచడంతో.. గెలుపు తథ్యమని భావించామని అన్నాడు. కానీ.. మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడం చాలా బాధకలిగించిందని చెప్పాడు. అసలు బాబర్ ఆజాం ఔట్ అయ్యాక తాము చాలా నిరుత్సాహ పడ్డామనీ.. ఈ ఫలితం తమను తీవ్ర నిరాశ పరిచిందని చెప్పాడు. చివరి వరకు పోరాడి గెలిచిన టీమిండియాకు ఈ పాకిస్థాన్ ఫ్యాన్ అభినందనలు తెలిపాడు.