ODI WC 2023 Tickets: వచ్చే నెల 5 నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పలు కీలక మ్యాచ్‌లకు ఇదివరకే టికెట్ల అమ్మకం పూర్తైంది. తాజాగా ఐసీసీ, బీసీసీఐలు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకూ టికెట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి నుంచి వన్డే వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు టికెట్ల బుకింగ్ ఓపెన్ కానుంది.
ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి గాను క్రికెట్ ఫ్యాన్స్ ఐసీసీ అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.com లో బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకం మొదలవుతుంది. ఈ మేరకు ఐసీసీ కూడా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఏ మ్యాచ్‌లకు టికెట్లు?
సెమీఫైనల్ 1 : నవంబర్ 15న జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది.
సెమీఫైనల్ 2 : నవంబర్ 16న రెండో సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది.
ఫైనల్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19న వన్డే ప్రపంచకప్‌లో తుదిపోరు జరుగనుంది.
పైన పేర్కొన్న మూడు మ్యాచ్‌లకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
భారత్, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, సౌతాఫ్రికా లు తలపడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ ఇండియాలోని పది ప్రముఖ నగరాల్లో జరుగుతుంది.
టికెట్ బుకింగ్ ఇలా..
సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు ఈ కింది విధంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- బుక్‌మైషో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ‘Search matches by venue’ అనే ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ వన్డే వరల్డ్ కప్‌లో మీరు ఏ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
- అక్కడ సీట్లను ఎంపిక చేసుకున్న తర్వాత ‘బుక్’అనే ఆప్షన్ కనబడుతుంది.
- టికెట్లను డెలివరీ చేసుకోవడానికి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- ఇక చివరిగా పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లాక అక్కడ చివరి అంకాన్ని పూర్తి చేసుకుని బుక్ చేసుకోవడమే.
అయితే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లకు డిమాండ్ దృష్ట్యా అభిమానులు వీలైనంత వరకూ ఎక్కువసేపు ఫోన్‌ను రిఫ్రెష్ చేయకుండా ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో భారత్ - పాక్ మ్యాచ్, భారత్ - ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లలో ఒక్కో టికెట్ బుక్ చేసుకునేందుకు ఒక్కొక్క నెటిజన్ సుమారు ఏడెనిమిది గంటలు వేయిట్ చేసినా టికెట్ బుక్ కాలేదు. పలు వెబ్‌సైట్స్ ఇబ్బడిముబ్బడిగా టికెట్లను బుక్ చేసుకుని వాటిని సెకండరీ మార్కెట్‌లో అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నాయి. భారత్ -పాక్ మధ్య అహ్మదాబాద్‌లో వచ్చే నెల 14న జరిగే మ్యాచ్ చూసేందుకు కొంతమంది ఆరు వేల సీట్‌కు ఏకంగా ఐదు, ఆరు, పది లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు. సో, టికెట్లను బుక్ చేసుకునేప్పుడు బీ కేర్ ఫుల్..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial