ODI World Cup 2023: భీకర ఫామ్‌లో ఉన్న భారత టాపార్డర్‌ జూలు విదిలిస్తే ఏట్లుంటదో తెలుసా.. రోహిత్‌ తొలి ఓవర్‌ నుంచే విధ్వంసం సృష్టిస్తే ఎట్లుంటదో తెలుసా.... ప్రపంచకప్‌ సెమీస్‌లో విరాట్‌... క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును బద్దలుకొడితే ఎట్లుంటదో తెలుసా... శ్రేయస్స్‌ అయ్యర్‌ దొరికిన బంతి దొరికినట్లు బాదితే ఎట్లుంటదో తెలుసా... ఇట్లుంటది... ప్రపంచకప్‌ సెమీస్‌లో  న్యూజిలాండ్‌ భారత్‌ బ్యాటింగ్‌ను చూస్తే తెలుస్తుంది. తొలుత రోహిత్‌-గిల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసి బలమైన పునాది వేస్తే ఆ పునాదిపై విరాట్‌ కోహ్లీ, శ్రేయస్స్‌ అయ్యర్‌  భారీ స్కోరు నిర్మించారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్స్ అయ్యర్‌ శతకాలతో చెలరేగారు. తన అనుభవాన్నంత రంగరించి కోహ్లీ శతకాన్ని బాదగా.. అయ్యర్‌ దొరికిన బంతిని దొరికినట్లు బాది అద్భుత సెంచరీ చేశాడు. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ తీసుకుంది. ఆరంభం నుంచే టీమిండియా సారధి రోహిత్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. తొలి ఓవర్‌ నుంచే రోహిత్‌ విధ్వంసం ప్రారంభమైంది. గిల్‌తో కలిసి రోహిత్ శర్మ టీమిండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే పది పరుగులు రాబట్టిన రోహిత్‌... దొరికి బౌలర్‌ను దొరికనట్లు బాదేశాడు. గిల్‌ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 4 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు చేసిన హిట్‌ మ్యాన్‌ అర్ధ శతకానికి ముందు అవుటయ్యాడు. సౌధీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి రోహిత్ అవుటయ్యాడు. కానీ రోహిత్‌ అవుటయ్యే సరికే 8.2 ఓవర్లలో భారత్‌ స్కోరు 71 పరుగులకు చేరింది. గిల్‌ కూడా ధాటిగా ఆడాడు . 65 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఈ దశలో గిల్‌కు తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 


 

గిల్‌ వెనుదిరిగగానే కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. వాంఖడే పిచ్‌లో బంతి బ్యాట్‌ మీదకి కొంచెం నెమ్మదిగా వస్తుండడంతో భారీ స్కోరు ఖాయమేనా అన్న అనుమానాలను వీరిద్దరూ పటాపంచలు చేశారు. భారీ షాట్లు ఆడుతూనే వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశారు. ఎక్కడా రన్‌రేట్‌ తగ్గకుండా భారీ షాట్లు ఆడారు. ఓవర్‌కు కనీసం ఒక భారీ షాట్‌ ఆడేలా ప్రణాళిక రచించి దానిని పక్కాగా ఆమలు చేశారు. ఈక్రమంలో 160 బంతుల్లో 8 పోర్లు, 1 సిక్సర్‌తో వంద పరుగుల మైలురాయిని అధిగమించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. సెంచరీ చేసిన అనంతరం మైదానంలోనే కోహ్లీ... సచిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బ్యాట్‌ చూపించాడు. తన ఆరాధ్య దైవం ముందే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో అయ్యర్‌ శతకం బాదేశాడు.

 

అనంతరం స్కోరును పెంచే క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి అయ్యర్‌ వెనుదిరిగాడు. చివరి ఏడు బంతులు ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యా భారీ షాటుకు యత్నించి అవుటయ్యాడు. కేవలం 2 బంతుల్లో ఒకే పరుగు సాధించి స్కై వెనుదిరిగాడు.  చివర్లో రాహుల్‌ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. రాహుల్‌ కొట్టిన 39 పరుగుల్లో 32 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌  విధ్వంస బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.

 

భారత బౌలర్ల ధాటికి కీవీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టిమ్‌ సౌథీ 10 ఓవర్లలో వంద పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌ 10ఓవర్లలో 86 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీసుకున్నాడు. ఫెర్గూసన్ 8 ఓవర్లలో 65, రచిన్‌ రవీంద్ర 7 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చారు.