Maxwell Fastest ODI Hundred in World Cup 2023:
పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కాసేపు నిలబడితే ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్ ఆడని మ్యాక్స్‌వెల్ సునామీలా డచ్ జట్టుపై విరుచుకుపడ్డాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది పడేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని సాధించేశాడు. మ్యాక్స్‌వెల్ సునామీలో డచ్ బౌలర్లు కొట్టుకుపోయారు. దొరికిన బంతిని దొరికినట్లు.. బంతి ఎక్కడ వేయాలో కూడా బౌలర్లకు తేలీదన్నట్లు విధ్వంసం సృష్టించాడు. మ్యాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఇది నాల్గవ వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 44 బంతులో ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేశాడు. గ్లెన్ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు.
ఇదే ప్రపంచకప్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి ఇప్పటివరకూ వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే ప్రపంచకప్‌లో ఆ రికార్డును మ్యాక్స్ వెల్ బద్దలు కొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఉంది. కెవిన్ ఓబ్రెయిన్ 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీలు
40 బంతుల్లో మ్యాక్స్‌వెల్ vs నెదర్లాండ్స్‌పై 2023
49 బంతుల్లో ఐడెన్ మార్క్‌రామ్ vs శ్రీలంక2023
50 బంతుల్లో కెవిన్ ఓబ్రెయిన్ vs ఇంగ్లండ్, బెంగళూరు 2011
51 బంతుల్లో గ్లెన్ మాక్స్‌వెల్ vs శ్రీలంక2015
52 బంతుల్లో AB డివిలియర్స్ vs వెస్టిండీస్ 2015
ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీ ఇన్నింగ్స్.. డేవిడ్ వార్నర్ మరోసారి శతక గర్జన చేసిన సమయాన... పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. డచ్ జట్టుపై నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్ వెల్ 106 పరుగులు చేశాడు. మ్యాక్స్ వెల్ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్ బాయ్... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్, లబుషేన్ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో స్మిత్ 71 పరుగులు చేశాడు. లబుషేన్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో లబుషేన్ 62 పరుగులు చేశాడు.