Nicholas Pooran: ఐదు టీ20ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ కేవలం 40 బంతుల్లో 67 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అయితే అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం నికోలస్ పూరన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నికోలస్ పూరన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
గయానా టీ20 తర్వాత నికోలస్ పూరన్ అంపైరింగ్‌ను బహిరంగంగా విమర్శించాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌పై ఫైన్ విధించారు. ఈ విషయంలో నికోలస్ పూరన్‌ను లెవెల్-1 కింద దోషిగా నిర్థారించారు. ఆ తర్వాత ఐసీసీ ఆర్టికల్ 2.7 ప్రకారం నికోలస్ పూరన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
ఐసీసీ ఆర్టికల్ 2.7 ప్రకారం ఒక ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్‌లొ జరిగిన ఏదైనా జరిగిన సంఘటనను బహిరంగంగా ఖండిస్తే, అది ఐసీసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ నికోలస్ పూరన్ కూడా తన తప్పును అంగీకరించాడు.
సిరీస్‌లో 2-0తో వెస్టిండీస్ ఆధిక్యం
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ అద్భుత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో కరీబియన్ జట్టు 2-0తో ముందంజ వేసింది. తొలి మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ మంగళవారం నాడు జరగనుంది.