Nepal Airee Makes History By Smashing Six Sixes In An Over: నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ(Dipendra Singh Airee)  దుమ్ములేపాడు. ఒకే ఓవర్‌లో ఆరు వరుస సిక్స్‌లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన మూడో బ్యాటర్‌గా దీపేంద్రసింగ్‌ రికార్డులకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్‌ కప్‌లో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్‌ ఐరీ ఈ అరుదైన ఘనత సాధించాడు. 2007 టీ20 వరల్డ్‌క్‌పలో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదగా.. 2021లో శ్రీలంకతో మ్యాచ్‌లో స్పిన్నర్‌ ధనంజయ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఈ రికార్డును సాధించాడు. దీపేంద్ర గతంలో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 9బంతుల్లోనే అర్ధసెంచరీ బాది రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. 


ఈ మ్యాచ్‌ గుర్తుందా...
గతంలో నమీబియా నయా సంచలనం నికోల్‌ లోఫ్టీ ఈటన్‌ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఈటన్‌ అవతరించాడు. నేపాల్‌ వేదికగా నేపాల్‌, నమీబియా, నెదర్లాండ్స్‌ మధ్య ట్రై సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా నేపాల్‌, నమీబియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్‌ ఈటన్‌ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. 11 ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఈటన్‌ 11 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. నికోల్ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో నమీబియా విజయం సాధించింది. పొట్టి క్రికెట్‌లో నికొల్‌కు మంచి రికార్డు ఉంది. సుడిగాలి ఇన్నింగ్స్‌ల‌తో విరుచుకుప‌డే ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క హాఫ్ సెంచ‌రీ బాద‌లేదు.    


టీ20ల్లో వేగవంతమైన సెంచరీలు..
జాన్‌ నికోల్‌ (నమీబియా) - 33 బంతులు
కుశాల్‌ మల్లా (నేపాల్‌) - 34 బంతులు
డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా) - 35 బంతులు
రోహిత్‌ శర్మ (భారత్‌) - 35 బంతులు
సుదేశ్ విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌) - 35 బంతులు



ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 22 ఏళ్ల జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. జాన్ నికోల్ లాఫ్టీ క్రీజులోకి వచ్చే సమయానికి నమీబియా స్కోర్ 10.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62గా మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో 200 దాటింది. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న జాన్ నికోల్ లాఫ్టీ 101 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ మలన్ క్రుగర్ 48 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలిచింది. నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లు పడగొట్టాడు. జాన్ నికోల్ లాఫ్టీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.