IPL 2024 KKR vs LSG preview and Prediction : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR).... నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన కోల్‌కత్తా గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఓడిపోయి తొలి పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని కోల్‌కత్తా భావిస్తోంది. మరోవైపు అయిదు మ్యాచుల్లో మూడు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో... గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై గెలిచి మళ్లీ గాడినపడాలని రోహిత్ సేన చూస్తోంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో ఇరు జట్లు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు జట్లు గత మ్యాచ్‌లో ఓడిపోవడంతో మళ్లీ విజయాల బాట పట్టేందుకు ఈ మ్యాచ్ దోహదపడనుంది.
నరైన్, రస్సెల్‌పైనే ఆధారం
కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఎక్కువగా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లపైనే ఎక్కువ ఆధారపడుతోంది. వీరిద్దరూ విఫలం కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కత్తా ఓడిపోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ (27), రస్సెల్ (10) బ్యాట్‌తో విఫలం కావడంతో కోల్‌కత్తాకు ఓటమి తప్పలేదు. నరైన్, రస్సెల్ దూకుడుతో గత మ్యాచుల్లో కోల్‌కత్తా 200కుపైగా స్కోరు సాధించింది. కానీ వీరిద్దరూ విఫలం కావడంతో చెన్నైపై కేవలం 137 పరుగులకే పరిమితమైంది. నితీష్ రానా లేకపోవడంతో కోల్‌కత్తా కీలక బ్యాటర్‌ను కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న నితీశ్ రానా.... ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారీ స్కోరుపై కన్నేశాడు. గత నాలుగు మ్యాచుల్లో అయ్యర్ 0, 39, 18, 34 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఫామ్‌లోకి రావాలని అయ్యర్ చూస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మాత్రమే అర్ధ శతకం సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. మిచెల్ స్టార్క్ పేలవమైన ఫామ్ కోల్‌కత్తాను ఆందోళన పరుస్తోంది. ఈ ఆసీస్ పేసర్ ఓవర్‌కు పదకొండు పరుగులు ఇచ్చేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో 100కుపైగా పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్ అనుకుల్ రాయ్ ఆకట్టుకున్నాడు. సునీల్ నరైన్‌తో కలిసి అనుకుల్ రాయ్ ఆకట్టుకున్నాడు. ఈడెన్‌లో KKR ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
మయాంక్ లేకుండానే..?
గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయిన లక్నో ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉంది. స్పీడ్ స్టార్, పేసర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానుండడం లక్నోకు ప్రతికూలంగా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్య నుంచి వైదొలిగిన మయాంక్ ఇంకా కోలుకోలేదు. మయాంక్ స్థానంలో జట్టులోకి వచ్చిన అర్షద్ ఖాన్ అంచనాలు అందుకోలేక పోయాడు. క్వింటన్ డి కాక్, రాహుల్ భారీ స్కోర్లు చేయాలని పట్టుదలగా ఉన్నారు. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణిస్తే లక్నో భారీ స్కోరు చేస్తుంది. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా కూడా గాడిన పడాల్సి ఉంది.
జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్ మరియు ముజీబ్ ఉర్ రెహమాన్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ మరియు మొహమ్మద్ అర్షద్ ఖాన్.