Dhoni Vs Pant: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోదరి సాక్షి పంత్ పెళ్లి ఇటీవల ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకుకు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. అందరిలోకెళ్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు. పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కూడా ధోనీ సందడి చేశాడు. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మధ్య ఆకర్షణీయ సంభాషణ జరిగింది. అక్కడున్న వాళ్లు ఏదో ప్రశ్న అడుగా.. తమ రిలేషన్ షిప్ లో ధోనీనే లక్కీ అని సాక్షి మురిపెంగా చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా హుషారయ్యారు. మధ్యలోకి ఎంటరైన పంత్.. ఆడవాళ్లందరూ ఇలాగే అనుకుంటారని కౌంటర్ వేయడంతో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు ఈ వీడియోపై కామెంట్లు చేస్తూ, లేకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.
వేదికను పంచుకున్న గంభీర్, ధోనీ..
ఈ పెళ్లికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యాడు. ధోనీతో కలిసి తను ఫొటోలు దిగాడు. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజానికి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ సాధించడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. టీమంతా కలిసి కప్పు సాధిస్తే, ధోనీనే మొత్తం క్రెడిట్ కొట్టేస్తున్నాడంటూ గతంలో పలు సందర్బాల్లో పరోక్షంగా ధోనీపై గంభీర్ విమర్శలు చేశాడు. ఆ తర్వాత వీరెప్పుడు వేదికను పంచుకోలేదు. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవని ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫాలోవర్లు అప్పుడప్పుడు ఫ్యాన్స్ వార్ కూడా చేస్తుంటారు.
సందడి చేసిన రైనా..
ఈ వేడుకకు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా హాజరయ్యాడు. పెళ్లికి ముందు పంత్ తో కలిసి రైనా చేసిన డ్యాన్స్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ఒక ఊపాయి. తమలోని డ్యాన్సింగ్ టాలెంట్ ని వీరిద్దరూ ప్రదర్శించారని అభిమానులు మురిసిపోయారు. ఇక ధోనీ కూడా తన లోని సింగర్ ను పరిచయం చేశాడు. ప్రముఖ చిత్రం అజబ్ ప్రేమ్ కీ ఘజబ్ కహానీ లోని తూ జానేనా పాటను ఆలపించాడు. ధోనీలోని సింగింగ్ టాలెంట్ చూసి అతని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన చిత్రాలు , వీడియలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. పంత్ చెల్లెలు సాక్షి పంత్ కు సోషల్ మీడియాలో ఘనమైన ఫాలోయింగే ఉంది. తనను లక్షల్లో మంది ఫాలో అవుతున్నారు. పంత్ చెల్లెలు కావడంతోపాటు ట్రావెలాగ్, ట్రెండీ దుస్తులు ధరించడంతో యువతతోపాటు పలు వర్గాల ప్రజలు ఆమెను ఫాలో అవుతన్నారు. తన బాయ్ ఫ్రెండ్ అంకిత్ చౌదరీని పెళ్లి చేసుకుంది. ఇక బిజినెస్ మేన్ అయిన అంకిత్ తో తొమ్మిదేళ్లుగా ప్రేమలో మునిగి పోయింది. గతేడాది జనవరిలో లండన్ లో వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. దీనికి ధోనీ కూడా హాజరయ్యాడు.