Pakistan Cricket Board: కర్ణుడు మరణానికి సవాలక్ష కారణాలన్నట్లు... క్రికెట్ ప్రపంచంలో పాక్ అవస్థలకు కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఒక సమస్య నుంచి బయటపడి కాస్త తేరుకుంది అనుకునే లోపే..మరో సంక్షోభం పాక్ క్రికెట్ (Pakistan Cricket) ను వెంటాడుతోంది. ఒకప్పుడు ఆసియాలో భారత్(India) తో కలిసి క్రికెట్ ను ఏలిన పాకిస్థాన్.. ఇప్పుడు విజయం కోసం తీవ్రంగా అవస్థ పడుతోంది. తాజాగా బంగ్లాదేశ్(Bangladesh) తో జరిగిన టెస్టు సిరీస్ లో సొంత గడ్డపైనా ఓడి పాక్ అవమానం మూటగట్టుకుంది. గత రెండేళ్లుగా పాకిస్థాన్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేక సతమతమవుతోంది. పాక్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు, ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు... జట్టు ఎంపికలో వివక్షతో పాకిస్థాన్ విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. ఓవైపు పాకిస్థాన్ టీ 20 ప్రపంచకప్ గెలవడం.. సొంత మైదానంలో బంగ్లాను చిత్తుగా ఓడించడంతో పాక్ పై విమర్శల దాడి మరింత పెరిగింది. తాజాగా పాక్ ను మరో కీలక పరిణామం జరిగింది. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయంతో పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పీసీపీ సెలెక్టర్ మహ్మద్ యూసుఫ్ తన పదవికి రాజీనామా చేశాడు.
యూనస్ రాజీనామా..
మహ్మద్ యూనస్ వీడ్కోలుతో పాక్ మరో సంక్షోభానికి తెరలేచింది. ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన యూనస్. వ్యక్తిగత కారణాలతోనే తాను సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పీసీబీ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నానని.. పాక్ జాతీయ జట్టు ఎంపికలో భాగమవ్వడం చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు. పాక్ క్రికెట్ అభివృద్ధికి, విజయానికి దోహదపడినందుకు గర్వంగా ఉందని యూసుఫ్ అన్నాడు. పాక్ ఆటగాళ్ల ప్రతిభపై.. వారి ఆటతీరుపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని.. పాక్ క్రికెట్ త్వరలోనే గాడిన పడుతుందని యూనస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనున్న వేళ యూనస్ వీడ్కోలు పలకడం కలకలం రేపింది. ఇప్పటికే పీసీబీ సెలక్షన్ కమిటీ తొలి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతోనే యూనస్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Read Also : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
2004 నుంచి..
మహ్మద్ యూనస్ ను పీసీబీ సెలెక్టర్‌గా ఎంపిక చేసింది. అయితే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ సహా ద్వైపాక్షిక సిరీస్ లలోనూ పాక్ ఓడిపోయింది. దీంతో యూసుఫ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడే యూసుఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని అంతా భావించారు. గత నెలలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత విమర్శల తాకిడి మరింత పెరిగడంతో యూసుఫ్ తన పదవికి వీడ్కోలు పలికాడు. యూసుఫ్ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. పాక్ జట్టు తరపున 90 టెస్టులు, 288 వన్డేలు, మూడు T20I మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 39 సెంచరీలు, 97 అర్ధసెంచరీలు ఉన్నాయి.