కోట్ల మంది భారత(Bharat) ఆభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా(Australia) ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. అయితే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) చేసిన పనిపై నెటిజన్లు మాజీలు, సహచర క్రికెటర్లు మండిపడుతున్నారు. ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో సామాజిక మాధ్యమాలను చుట్టేసింది. ప్రతిష్ఠాత్మక ట్రోఫి పట్ల మిచెల్ మార్ష్ అవమానకరంగా ప్రవర్తించడంపై అప్పట్లో అభిమానులు భగ్గుమన్నారు. మార్ష్ ఇదేం పని నెటిజన్లు మండిపడ్డారు. ఇంత అహంకారం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి మెగా ట్రోఫీకి కాసింత మర్యాద ఇవ్వండంటూ వేడుకున్నారు. ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గు చేటు కాదని మండిపడుతున్నారు. ఇంత జరిగినా మార్ష్ తాను చేసింది తప్పు కాదని సమర్థించుకున్నాడు. తనకు మళ్లీ అవకాశం వస్తే అలాగే ప్రవర్తిస్తానంటూ తేల్చి చెప్పాడు. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్ ట్రోఫీపై మార్ష్ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకోవడాన్ని మార్ష్ సమర్థించుకున్నాడు. ప్రపంచకప్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తేల్చి చెప్పాడు. ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదన్న మార్ష్... దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదన్నాడు. తాను సోషల్ మీడియాను ఎక్కువగా చూడనని... అందులో తనకు ఎలాంటి తప్పు కనపడలేదని తేల్చి చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడనని మార్ష్ తెలిపాడు.
ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్ అయినట్టు కనిపించారు. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.