Padikkal Fit For Number Three:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే శతకంతో మెరిసిన యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమవ్వడంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్, తొలి రోజే 131 పరుగులతో అజేయంగా నిలిచి భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ, సుదర్శన్ రీ-ఎంట్రీ ఇచ్చినా పడిక్కల్ నే నంబర్ 3 స్థానంలో కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ కు సూచించాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పడిక్కల్ టెక్నిక్ ఇండియాకు దేవుడిచ్చిన వరం లాంటిదని అతడు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నాడు.

Continues below advertisement

Read Also: IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!

స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం.. బ్యాక్ ఫుట్ షాట్ల మేజిక్తాజాగా ఓ చానెల్లో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్, పడిక్కల్ షాట్ సెలెక్షన్ ను కొనియాడాడు. "పడిక్కల్ రూపంలో ఇండియాకు పెద్ద మార్పు లభించింది. స్పిన్ బౌలింగ్ ను అతడు ఎంత సులభంగా ఎదుర్కొంటున్నాడో చూస్తే సెలెక్షన్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. స్పిన్ ను డిఫెన్స్ చేయడంలోనే కాకుండా ఫీల్డర్లు వెనక్కి వెళ్లినప్పుడు సింగిల్స్, డబుల్స్ తీయడంలోనూ అతడు మంచి నేర్పు కనబరిచాడు. స్లో, టర్నింగ్ పిచ్ లపై బ్యాక్ ఫుట్ తో అటాకింగ్ షాట్లు ఆడటం అద్భుతమైన విషయం. స్లో ట్రాక్స్ పై ఎక్కువ బంతులను బ్యాక్ ఫుట్ లో ఆడటమే స్పిన్ ను ఎదుర్కొనే సరైన పద్ధతి" అని వివరించాడు.

Continues below advertisement

Read Also: Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్

ముందుకు వచ్చి కొట్టే సత్తా.. నంబర్ 3 స్థానానికి పూర్తి అర్హుడుపడిక్కల్ కేవలం బ్యాక్ ఫుట్ కే పరిమితం కాకుండా క్రీజు వదిలి ముందుకు వచ్చి స్ట్రెయిట్ గా సిక్సర్లు కొట్టగలడని మంజ్రేకర్ చెప్పాడు. "స్పిన్ కు ఎక్కువ అనుకూలత ఉండే పిచ్ లపై సాయి సుదర్శన్ తిరిగి వచ్చినా పడిక్కల్ నే నంబర్ 3 లో ఆడించాలి. ఎందుకంటే స్పిన్నర్ల బౌలింగ్ లో అతడు ఎంతో ప్రమాదకరమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడి వద్ద ఉన్న స్పిన్ టాలెంట్ వల్ల నంబర్ 3 స్థానంలో అతడు జట్టుకు లభించిన ఒక గొప్ప ఆస్తి" అని తెలిపాడు.

131 రన్స్ నాటౌట్.. పడిక్కల్ జోరుతో భారత్ పటిష్టం26 ఏళ్ల పడిక్కల్ తొలి టెస్ట్ సెంచరీ సాధించి భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. టాప్ ఆర్డర్ లో అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల జట్టుకు స్థిరత్వం లభించింది. శ్రీలంక స్పిన్నర్ల ఎటాక్ ను అలవోకగా తిప్పికొడుతూ అతడు ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే మ్యాచ్ లలో అతడి స్థానం మరింత సుస్థిరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆదివారం రెండో రోజు వ‌ర్షం కార‌ణంగా ఆట ప్రారంభం కాలేదు. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఎర్లీ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. తొలిరోజు ఆట ముగిసేస‌రికి 73 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 288 ప‌రుగుల‌ను భార‌త్ చేసిన సంగ‌తి తెలిసిందే.