Devdutt Padikkal Hits Milestone Test Century: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. రెగ్యులర్ నంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన కెరీర్ లోని మూడో టెస్టులోనే తొలి సెంచరీ సాధించాడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు అంతర్జాతీయ సెంచరీ బాదిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అయితే కోహ్లీ వన్డేల్లో ఈ ఫీట్ సాధించగా, టెస్ట్ ఫార్మాట్ లో ఇండిపెండెన్స్ డే నాడు సెంచరీ కొట్టిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Continues below advertisement

Continues below advertisement

కోహ్లీ రేర్ రికార్డు సమం.. 147 బంతుల్లోనే అజేయ శతకంగతంలో విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆగస్టు 15న 99 బంతుల్లో 114 రన్స్ నాటౌట్ గా కొట్టాడు. రిపబ్లిక్ డే (2012 లో ఆస్ట్రేలియాపై 116), ఇండిపెండెన్స్ డే రెండింటిలోనూ సెంచరీలు కొట్టిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా కోహ్లీ ఉన్నాడు.  పడిక్కల్, గాలే టెస్టులో 178 బంతుల్లో 131 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో స‌త్తా చాటాడు ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స‌ర్ ఉండ‌టం విశేషం. దీంతో నంబర్ 3 స్లాట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.

నంబర్ 3 కోసం 19 టెస్టుల నిరీక్షణ.. పడిక్కల్ డ్రీమ్ రన్2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత, నంబర్ 3 స్థానంలో ఇండియాకు శతకం రాలేదు. ఆ తర్వాత జరిగిన 19 టెస్టుల్లో ఇండియా ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను ప్రయత్నించినా వారి ఉమ్మడి సగటు కేవలం 27.28 మాత్రమే ఉంది. పడిక్కల్ సెంచరీతో ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తన గత 7 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో పడిక్కల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 87.75 సగటుతో 702 రన్స్ బాదాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రంజీల్లో పంజాబ్‌పై 120, ఉత్తరాఖండ్‌పై 232, శ్రీలంక-ఎ పై 94 రన్స్ కొట్టి సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

రాహుల్ తో 150 రన్స్ పార్ట్‌నర్‌షిప్.. పంత్ తో కలిసి క్రీజులోటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, యశస్వి జైస్వాల్ (32) వికెట్ కోల్పోయాక కేఎల్ రాహుల్ (77), పడిక్కల్ కలిసి రెండో వికెట్‌కు 150 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగగా, గిల్ 16 రన్స్ మాత్రమే చేశాడు. వర్షం కారణంగా 73 ఓవర్లకే పరిమితమైన ఆటలో శ‌నివారం తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి  2 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. పడిక్కల్ సెంచరీ ఇండియాను పటిష్ట స్థితిలో నిలిపింది.