Devdutt Padikkal Hundred Puts India Ahead vs SL: శ్రీలంకతో గాలే వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే ఇండియన్ బ్యాటర్లు అద్భుత ఆధిపత్యం చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, వర్షం కారణంగా 73 ఓవర్లకే పరిమితమైన ఆట శ‌నివారం తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి  2 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది. నంబర్ 3 స్థానంలో వచ్చిన యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సూప‌ర్బ్ అజేయ‌ సెంచ‌రీ (178 బంతుల్లో 131 బ్యాటింగ్, 12 ఫోర్లు, 1 సిక్స‌ర్ ) తో స‌త్తా చాటాడు. దీంతో నంబర్ 3 పొజిషన్ లో దాదాపు 20 టెస్టుల తర్వాత ఇండియా తరఫున ఒక బ్యాటర్ సెంచరీ కొట్టడం విశేషం. బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌కు ఒక వికెట్ ద‌క్కింది. 

Continues below advertisement

Continues below advertisement

జైస్వాల్ రనౌట్.. రాహుల్ తో కలిసి పడిక్కల్ 150 రన్స్ భాగస్వామ్యం

అంత‌కుముందు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (32) , కేఎల్ రాహుల్ (77 రిటైర్డ్ హ‌ర్ట్) శుభారంభం అందించారు. వీరిద్ద‌రూ మంచి జోరు క‌న‌బ‌ర్చ‌డంతో భార‌త్ తొలి వికెట్ కు 47 ప‌రుగులు జోడించింది. అయ‌తే సాఫీగా సాగుతున్న ఈ జంట‌ సమన్వయ లోపం కారణంగా జైస్వాల్, రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ తో కలిసి శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు ఏకంగా 150 రన్స్ పార్ట్‌నర్‌షిప్ జోడించాడు. రాహుల్ క్లాసిక్ షాట్లతో 77 రన్స్ చేసి మంచి ఫామ్ లో కనిపించిన సమయంలో ఫోర్ ఆర్మ్ కండరాల పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. ఆఖరి సెషన్ లో రాహుల్ బ్యాటింగ్ కు రాకపోవడం టీమ్ ను కాస్త ఆందోళనకు గురిచేసింది.

గిల్ ని నిలువరించిన జయసూర్య.. పంత్ తో కలిసి పడిక్కల్ జోరుఇక రాహుల్ వెనుదిరిగిన త‌ర్వాత , కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 16 రన్స్ మాత్రమే చేసి శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (27 బ్యాటింగ్) తో కలిసి పడిక్కల్ చివరి 40 నిమిషాల పాటు లంక స్పిన్ అటాక్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పిచ్ నుంచి బంతి టర్న్ అవుతున్నప్పటికీ ఇద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. వీరిద్ద‌రూ అజేయమైన మూడో వికెట్ కు 52 ప‌రుగులు జోడించారు.

గాలే పిచ్ పై టర్న్.. శ్రీలంకకు డేంజర్ బెల్స్తొలి రోజే పిచ్ పై స్పిన్నర్లకు అద్భుతమైన టర్న్ లభించడం శ్రీలంక జట్టును కలవరపెడుతోంది. ఇండియా కేవలం 73 ఓవర్లలోనే 287 రన్స్ వేగంగా జోడించడంతో భారీ ఆధిక్యం సాధించే అవకాశం దక్కింది. రాబోయే రోజుల్లో పిచ్ మరింతగా టర్న్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఇండియా స్పిన్నర్లకు ఇది బిగ్ అడ్వాంటేజ్ గా మారనుంది.