Rain Threatens Galle Test Clash: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఉన్న ఇండియన్ టీమ్, శ్రీలంకతో గాలే వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో 2-2 డ్రా, వెస్టిండీస్‌పై 2-0 గెలుపు, సౌత్ ఆఫ్రికాతో 0-2 ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా, ఫైనల్ బెర్త్ కోసం మిగిలిన చాలా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో రెడ్ బాల్ సిరీస్ ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
చారిత్రాత్మక 600వ టెస్ట్ మ్యాచ్.. ముసురుకున్న నల్లని మేఘాలుఈ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ల్యాండ్‌మార్క్ 600వ టెస్ట్ కావడం విశేషం. ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ పోరుకు వర్షం తీవ్ర ముప్పుగా మారింది. శనివారం మ్యాచ్ ప్రారంభం కానుండగా, వాతావరణ శాఖ 90 శాతం వర్ష సూచన, 92 శాతం క్లౌడ్ కవర్ అంచనా వేసింది. ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో, సోనీలివ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.
ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా ఎటాక్.. పేస్ విభాగంలో గట్టి పోటీ గాలే పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ లతో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఇండియా రంగంలోకి దించనుంది. పేస్ విభాగంలో సీనియర్ మహమ్మద్ సిరాజ్ కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు యువ పేసర్ గుర్నూర్ బ్రార్ పాత బాల్ తో అద్భుతంగా బౌన్స్ రాబట్టగలడని కెప్టెన్ గిల్ ప్రశంసించాడు. ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉండటంతో అతడికే తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్.. వరుణుడిని తట్టుకుని గెలవాల్సిందే
వర్షం కారణంగా శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ కూడా అర్ధాంతరంగా ముగిసింది. క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నా మ్యాచ్ లో పైచేయి సాధించి సిరీస్ లో బోణీ కొట్టాలని ఇండియన్ టీమ్ పట్టుదలతో ఉంది. వర్షం అంతరాయాలు కలిగించినా తక్కువ సమయంలోనే ఫలితాన్ని రాబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
