IND VS SL Historic Test Match Ambition:  శ్రీలంకతో శనివారం ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని నమోదు చేయనుంది. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇండియాకు 600వ టెస్ట్ కాగా, ఈ చారిత్రక వేదికపై ఇది 50వ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇండియా స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మ్యాచ్ ప్రారంభం కానుండటం విశేషం. అయితే రికార్డుల కంటే కూడా వచ్చే ఏడాది జూన్ లో ఓవల్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కు క్వాలిఫై అవ్వడమే తమ మెయిన్ టార్గెట్ అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా, ఫైనల్ చేరాలంటే మిగిలిన తొమ్మిది టెస్టుల్లో ఆరు నుంచి ఏడు మ్యాచ్ లు గెలవాల్సి ఉంది.

Continues below advertisement

Continues below advertisement

డబ్ల్యూటీసీ ఫైనల్ పైనే గురి.. ప్రిపరేషన్స్ పై గిల్ కామెంట్స్మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ గిల్ మాట్లాడుతూ, "కెప్టెన్ రోల్ లో నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. గడిచిన ఏడాది కాలంలో టీమ్ పురోగతి సాధిస్తున్న విధానం సంతోషాన్ని ఇస్తోంది. సరైన దిశలోనే అడుగులు వేస్తున్నాం. మా ప్రధాన లక్ష్యం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటమే. ఇందుకోసం మిగిలిన టెస్టుల్లో దాదాపు ఏడు మ్యాచులు గెలవాలి. అందుకే ఈ సిరీస్ మాకు చాలా క్రూషియల్. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త ఎక్కువ సమయం కావాలి. అందుకే ముందుగానే వచ్చి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం" అని వివరించాడు.

బుమ్రా లేకపోయినా బౌలింగ్ స్ట్రాంగ్.. ప్రసిద్ధ్ పై ప్రశంసలుస్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా జట్టు బౌలింగ్ యూనిట్ పై పూర్తి నమ్మకం ఉందని గిల్ చెప్పాడు. "గుర్నూర్ బ్రార్ మంచి పేస్ తో పాత బాల్ ను బౌన్స్ చేయగలడు. ప్రసిద్ధ్ కృష్ణ రీసెంట్ గా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత బెస్ట్ ఫామ్ లో అతడు కనిపించాడు. బుమ్రా లేకపోవడం ఇతర పేసర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఒక మంచి అవకాశం. తొలి రెండు రోజుల్లో వికెట్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేకపోయినా ఫీల్డింగ్ వ్యూహాలతో ఒత్తిడి పెంచి వికెట్లు తీయాలి" అని పేర్కొన్నాడు.

గాలే మైదానంలో గాలి ప్రభావం.. పడిక్కల్ కు బిగ్ ఛాన్స్లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ గురించి మాట్లాడుతూ, "ఇండియా-ఎ తరఫున పడిక్కల్ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడికి మంచి నైపుణ్యం ఉంది. గాలే లాంటి ఓపెన్ గ్రౌండ్లలో గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో గ్రౌండ్లు క్లోజ్డ్ గా ఉంటాయి కాబట్టి ఈ తేడాను గమనించాలి. స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు గాలి ఎటు వీస్తుందో చూసుకుని ఆడితే అడ్వాంటేజ్ లభిస్తుంది" అని గిల్ వివరించాడు.