బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో విరాట్ కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో రోహిత్ సేన పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాతో మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అసలు సెంచరీ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ విరాట్ శతక నినాదం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంగ్లాపై గెలవాలంటే టీమిండియాకు 24 పరుగులు కావాలి. ఆ సమయంలో కోహ్లీ 74 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంటే కోహ్లీ సెంచరీకి 26 పరుగులు కావాలి. 74 పరుగుల తర్వాత టీమిండియా విజయానికి కావాల్సిన ప్రతీ పరుగును విరాటే చేశాడు. ఆ 26 పరుగులను కోహ్లీని పూర్తి చేసి అటు జట్టుకు విజయాన్ని ఇటు శతకాన్ని సాధించాడు. దీని వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని కె.ఎల్. రాహుల్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. విరాట్ సెంచరీ వద్దనుకున్నాడని... కానీ తానే సెంచరీ సాధించాలని చెప్పినట్లు రాహుల్ వెల్లడించాడు. విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తానని చెప్పినా తానే వద్దని చెప్పానని... సెంచరీ సాధించాలని సూచించానని తెలిపాడు.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
విరాట్ కోహ్లి సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తే తానే వద్దని చెప్పానని కె.ఎల్ రాహుల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. కానీ సింగిల్స్ తీయకుంటే బాగుండదని... వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని కోహ్లీ తనతో చెప్పాడని రాహుల్ వెల్లడించాడు. కానీ మనం ఎలాగో గెలుస్తామని, అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదని కోహ్లీకి తెలిపానని. సెంచరీ పూర్తిచేయమని చెప్పానని రాహుల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ సాధించే అవకాశమిచ్చాడు. సింగిల్స్ కోసం కోహ్లి ప్రయత్నించినా రాహుల్ వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 97తో ఉన్నాడు. జట్టు విజయానికి రెండు పరుగులే కావాల్సిన దశలో 42వ ఓవర్ తొలి బంతి లెగ్‌సైడ్ వెళ్లడంతో అంపైర్ వైడ్ ఇస్తాడా అన్నట్లు కోహ్లి చూశాడు. కానీ కోహ్లి కాస్త లోపలికి జరిగాడని భావించి అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే
బంగ్లాతో విజయం తర్వాత పాయింట్ల పట్టికలో భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. భారత్, న్యూజిలాండ్‌లు చెరో ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే కివీస్ జట్టు నెట్ రన్ రేట్ భారత్ కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్టోబర్ 22న ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి జట్లతో భారత జట్టు ఆడనుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్, గిల్.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. అద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్ 103 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. నౌషమ్ అహ్మద్ వేసిన 41 ఓవర్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి కింగ్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది.