Kane Williamson Leave New Zealand Captaincy: ప్రపంచకప్‌ క్రికెట్‌లో అద్భుత కెప్టెన్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన న్యూజిలాండ్(New Zealand) కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson )సంచలన ప్రకటన చేశాడు. తన కెప్టెన్సీతో కివీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విలియమ్సన్‌.... న్యూజిలాండ్‌కు ఐసీసీ టోర్నీలో అద్భుత విజయాలు అందించాడు. విలియమ్సన్‌ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించిడంతో అతడి భవిష్యత్తుపైనా సందేహాలు నెలకొన్నాయి. 2024-25 సీజన్ సెంట్రల్ కాంట్రాక్ట్ తీసుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన ప్రతిపాదనను కేన్‌ తిరస్కరించాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే విలియమ్సన్‌ కెప్టెన్‌గా వైదొలిగినా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని కివీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. T20 ప్రపంచకప్‌(T20 World Cup)లో లీగ్‌ దశలోనే కివీస్‌ వెనుదిరగడంతో కేన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఓడిపోయిన తర్వాత కివీస్‌ గ్రూప్ దశల్లోనే నిష్క్రమించింది. కేన్ విలియమ్సన్ 2024-25 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించినా మూడు ఫార్మాట్‌లలో కివీస్‌కు ఆడతానని ప్రకటించాడని కివీస్‌ బోర్డు వెల్లడించింది. 






అలా అర్థం చేసుకోవద్దు

అంతర్జాతీయ క్రికెట్‌పై ఆసక్తిని కోల్పోతున్నట్లు తన నిర్ణయాన్ని చూసి అర్థం చేసుకోవద్దని  విలియమ్సన్‌ అభిమానులను కోరాడు. భవిష్యత్తులో మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అంగీకరిస్తానని తెలిపాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ప్రస్తుతానికి తనకు చాలా ముఖ్యమైన విషయంమని విలియమ్సన్ తెలిపాడు. న్యూజిలాండ్‌కు ఆడటం తనకు చాలా విలువైనదని.. జట్టుకు తిరిగి ఇవ్వాలనే తన కోరిక ఇంకా తగ్గలేదని కేన్‌ తెలిపాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, స్వదేశంలో, విదేశాలలో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని కేన్‌ తెలిపాడు. విలియమ్సన్‌తో పాటు, లాకీ ఫెర్గూసన్ కూడా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాలని నిర్ణయించుకున్నాడు. 

 

దాని వల్లే

టీ20  అలాగే, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. గతంలో టెస్ట్ కెప్టెన్సీ  వద్దనుకున్న కేన్ , ఇప్పుడు తాజాగా 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసుకున్నాడు. టీ20  ప్రపంచ కప్‌ లో  కివీస్ ఘోరంగా విఫలమై  గ్రూప్‌ దశలోనే  వెనుదిరగడంతో  విలియమ్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ విషయాన్ని  న్యూజిలాండ్ జట్టు  తమ అధికారిక  సోషల్ మీడియా అకౌంటు లో ప్రకటించింది. 2024 టీ 20 ప్రపంచ కప్పు లో కివీస్  గ్రూప్ సిలో ఆడింది. ఆడిన  మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్‌లపై  కూడా ఘోర పరాజయాలు  పొందింది.  టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోన్యూజిలాండ్  జట్టు గ్రూప్‌ దశ దాటి ముందుకు వెళ్లలేకపోవటం ఇదే మొదటి సారి.