Jasprit Bumrah : రోహిత్ శర్మ భారతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో పయనించి టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. భారతీయ క్రికెట్ జట్టులోని ఈ ఇద్దరు గొప్ప ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి రిటైర్ అవ్వడంతో భారతీయ క్రికెట్ బోర్డుకు అతి పెద్ద సవాల్‌గా మారింది. వారి తర్వాత ఆటగాళ్లను భర్తీ చేసుకోవడంతోపాటు కెప్టెన్‌ను నియమించడం కూడా టఫ్ టాస్క్ అని చెప్పాలి. ఇప్పుడు జట్టు నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలి అనే చర్చ అటు బోర్డులో ఇటు సోషల్ మీడియా, మిగతా ప్లాట్‌ఫామ్స్‌లో నడుస్తోంది. అలాంటి సమయంలో భారతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బుమ్రా పేరు ఎందుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ కోసం ఎక్కువగా వినిపిస్తుందో చూద్దాం..
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ భయం
జస్ప్రీత్ బుమ్రా ప్రమాదకర బౌలింగ్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లలో భయాన్ని రేపుతుంది. బుమ్రా భారతదేశంలో మాత్రమే కాదు, విదేశీ గ్రౌండ్‌పై కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచి దక్షిణాఫ్రికా వరకు బుమ్రా తన బౌలింగ్‌తో తన సత్తా చాటుకున్నాడు. బుమ్రా వికెట్లు తీయడంతోపాటు రన్స్ ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసే జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రత్యర్థి జట్టుకు అతని బంతులను ఆడటం సులభం కాదు. బుమ్రా భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లలో ఒకడు.
కెప్టెన్‌గా బుమ్రా సాధించిన విజయం
జస్ప్రీత్ బుమ్రాను భారతీయ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా చేయడానికి అతని మానసిక స్థితి ఒక పెద్ద కారణం. బుమ్రా కెప్టెన్‌గా ఉంటూ జట్టును చక్కగా నిర్వహిస్తాడు. బుమ్రా 2024 బార్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్సీ చేశాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారతదేశం 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్‌గా 8 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాలో తన ముద్ర వేశాడు.
విరాట్-రోహిత్ లాంటి అగ్రెసివ్‌నెస్
జస్ప్రీత్ బుమ్రా చాలావరకు చాలా కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ ప్రత్యర్థి జట్టుతో సమానంగా పోటీ పడే మ్యాచ్‌లలో బుమ్రా అగ్రెసివ్‌నెస్ కూడా కనిపిస్తుంది. విరాట్, రోహిత్ కెప్టెన్సీలో కనిపించే వాడివేడీ బుమ్రా కెప్టెన్సీలో కూడా కనిపించవచ్చు. కానీ ఇంకా బుమ్రా కెప్టెన్ అవ్వడం గురించి బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. టెస్ట్ జట్టు కెప్టెన్ పోటీలో శుభ్‌మన్ గిల్ పేరు కూడా ఉంది.
బుమ్రాకు తరచూ ఫిట్‌నెస్ ఇష్యూలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇది మైనస్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సిరీస్ అంతటా నిలకడగా ఆడగల వ్యక్తిని సెలెక్టర్లు నియమించే అవకాశం ఉంది. అందుకే శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సెలెక్టర్లు త్వరలోనే నిర్ణయాన్ని ఖరారు చేస్తారని భావిస్తున్నారు,
భారతదేశం vs ఇంగ్లాండ్ టెస్ట్ షెడ్యూల్
IND vs ENG 1వ టెస్ట్: శుక్రవారం జూన్ 20-మంగళవారం జూన్ 24 - హెడింగ్లీ
IND vs ENG 2వ టెస్ట్: బుధవారం జులై 2-ఆదివారం జులై 6 - ఎడ్జ్‌బాస్టన్
IND vs ENG 3వ టెస్ట్: గురువారం జులై 10-సోమవారం జులై 14 - లార్డ్స్
IND vs ENG 4వ టెస్ట్: బుధవారం జులై 23-ఆదివారం జులై 27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
IND vs ENG 5వ టెస్ట్: గురువారం జులై 31-సోమవారం ఆగస్టు 4 - ది కియా ఓవల్