MS Dhoni moves Madras HC: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మద్రాస్‌ హై కోర్టును ఆశ్రయించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఐపీఎస్‌ అధికారి జీ సంపత్‌ కుమార్‌ సుప్రీం కోర్టు ఆదేశాలు, న్యాయవ్యాదులను ధిక్కరించారని పేర్కొన్నారు. ఆయనపై క్రిమినల్‌ కంటెప్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ పీఎన్‌ ప్రకాశ్ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించాల్సి ఉండగా  శుక్రవారం విచారణకు రాలేదు.


Also Read: మాకోసం శ్రీలంక గెలుస్తుంది, ఆ నమ్మకం ఉంది: ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్


Also Read: నమో.. నమో శ్రీలంక మాతా! ఇంగ్లాండ్‌ ఓడాలన్న ఆసీస్‌ ప్రార్థన ఫలిస్తుందా!!


పోలీసు ఐజీగా పనిచేస్తున్న సంపత్‌ కుమార్‌పై 2014లో ఎంఎస్‌ ధోనీ సివిల్‌ సూట్‌ను దాఖలు చేశారు. తనకు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌కు ముడిపెడుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కోరారు. అలాగే పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. 2014, మార్చి 18న ధోనీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ న్యాయ వ్యవస్థ, ఈ కేసులో ప్రభుత్వం తరఫున తనకు వ్యతిరేకంగా వాదించిన సీనియర్‌ న్యాయవాదిపై ఆరోపణలు చేస్తూ సంపత్‌ కుమార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ విషయం మద్రాస్‌ హైకోర్టు దృష్టికి రాగా 2021, డిసెంబర్‌లో ఇదే వ్యాజ్యం తీసుకుంది. ఈ ఏడాది జులై 18న కోర్టు ఉల్లంఘన గురించి అడ్వకేట్‌ జనరల్‌ ఆర్‌.షణ్ముగసుందరమ్‌ అభిప్రాయం కోరింది. దాంతో 2014లో కోర్టు ఆదేశాలను ధిక్కరించారని, మాజీ ఐపీఎస్‌ అధికారి సంపత్‌ కుమార్‌ను శిక్షించాలని కోరుతూ అక్టోబర్‌ 11న ఎంఎస్‌ ధోనీ కోర్టులో ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.