DC vs PBKS Preview:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16వ సీజన్ లో   పాయింట్ట పట్టికలో  ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్  నేడు  అరుణ్ జైట్లీ స్టేడియంలో  కీలక   మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ వస్తున్న పంజాబ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ఇంకా ఛాన్స్ అయితే  ఉంది.   నేడు ఢిల్లీతో జరుగబోయే  మ్యాచ్ తో పాటు  తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్టు  టాప్ - 4లో ఫోర్త్ ప్లేస్  కోసం పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో  పంజాబ్  కింగ్స్.. నేటి రాత్రి  7.30 గంటలకు  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో  ఢిల్లీ క్యాపిటల్స్ తో  కీలక మ్యాచ్ ఆడనుంది. 


ఢిల్లీకి పోయేదేమీ లేదు.. 


ఈ సీజన్ ను ఐదు వరుస  పరాజయాలతో ప్రారంభించి  ఇటీవలే చెన్నైతో మ్యాచ్ లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి  తప్పుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్ ఇకనుంచి ఫ్రీ బర్డ్.  నేడు పంజాబ్ తో పాటు  తర్వాత ఆడబోయే మరో రెండు మ్యాచ్ లలో గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఫరక్ పడదు.  సీజన్ ఆరంభం నుంచి పేలవ బ్యాటింగ్ తో కొట్టుమిట్టాడున్న  ఢిల్లీకి  ఆఖరి మ్యాచ్ లలో అయినా  కుదురుకుంటే అది ఆ జట్టు అభిమానులకు కాస్త ఊరటనిచ్చినట్టే.  


పంజాబ్‌కు గెలిస్తేనే.. 


ఐపీఎల్-16 లో  11 మ్యాచ్‌లు ఆడి   ఐదు గెలిచిన పంజాబ్ కింగ్స్‌కు  తమ ఖాతాలో 10 పాయింట్లున్నాయి. ఇంకా ఆ జట్టు ఢిల్లీతో  మ్యాచ్ కాక మరో రెండు గేమ్స్ ఆడనుంది. మూడింట గెలిస్తే ఆ జట్టుకు 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు   ప్లేఆఫ్స్ రేసులో   ఆర్సీబీ, లక్నోతో పాటు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండే జట్టుతో పోటీ పడొచ్చు. అయితే ఇది ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది. 


పంజాబ్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ రాణిస్తున్న మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ రెండు మూడు మ్యాచ్ లలో ధాటిగా ఆడి తర్వాత విఫలమయ్యాడు.  గత మ్యాచ్ లో భానుక రాజపక్స తిరిగొచ్చినా  నిరాశపరిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు.  జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ లు నిలకడగా ఆడుతుండటం  పంజాబ్‌కు కలిసొచ్చేదే. సామ్ కరన్ కూడా ఓ చేయి వేస్తే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో  అర్ష్‌దీప్ పవర్ ప్లే లో రాణిస్తున్నా డెత్ ఓవర్లలో  విఫలమవుతున్నాడు. ఇది పంజాబ్‌కు ఆందోళన కలిగించేదే..


 






పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరణ్, రిషి ధావన్, నాథన్ ఎల్లిస్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, హర్‌ప్రీత్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రాఠీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కగిసొ రబడ, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ, శివమ్ సింగ్, మాథ్యూ షార్ట్, సికందర్ రజా, అథర్వ తైడే, బల్తేజ్ సింగ్, రాహుల్ చాహర్, విద్యుత్ కావరప్ప


ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, ప్రియమ్ గార్గ్, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్, రిలీ రూసో