DC vs CSK Preview: ఐపీఎల్-16 లీగ్ స్టేజ్‌లో  మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నా  ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే టీమ్స్ పై సందిగ్ధత  వీడటం లేదు.  ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్‌లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ.. గత మ్యాచ్‌‌లో పంజాబ్‌కు ఇచ్చినట్టే చెన్నైకీ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా  మ్యాచ్ జరుగనుంది. 


చెన్నైకి కీలకం.. 


ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి  ఏడు గెలిచి ఐదు మ్యాచ్‌లు ఓడిన చెన్నై.. 15 పాయింట్లతో   రెండో స్థానంలో ఉంది. లక్నో కూడా  ఇవే  గణాంకాలతో  మూడో స్థానంలో ఉంది.  ప్లేఆఫ్స్ రేసులో దాదాపు ఈ రెండు జట్లూ 2, 3 స్థానాల్లో ఉన్నా  లీగ్ దశ ముగిసేనాటికి ఇదే కొనసాగాలంటే  చెన్నై.. ఢిల్లీని ఓడించటం కీలకం కానుంది.  ఢిల్లీని  చెన్నై ఓడిస్తూనే.. మెరుగైన రన్ రేట్  సాధిస్తే అప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్  మ్యాచ్‌లో  సీఎస్కే.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడే అవకాశముంటుంది.  అలా కాకుండా ఢిల్లీతో సీఎస్కే ఓడి.. తమ చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతాను ఓడిస్తే చెన్నై థర్డ్ పొజిషన్‌కు పడిపోతుంది.  ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్‌ను ఓడిస్తే అప్పుడు దానికి 16 పాయింట్లు వచ్చి చెన్నై  నాలుగో స్థానానికి పడిపోయే  ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో  చెన్నైకి ఢిల్లీతో మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. 


 






ఢిల్లీకి లైట్.. 


ఐపీఎల్-16ను వరుసగా ఐదు ఓటములతో ప్రారంభించి తర్వాత పడుతూ లేస్తూ  ఐదు విజయాలతో   పది పాయింట్లు సాధించి ఈ సీజన్ లో అందరికంటే ముందే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ  క్యాపిటల్స్‌కు నేటి మ్యాచ్‌లో గెలిచినా ఓడినా  పోయేదేం లేదు.   దీంతో గత మ్యాచ్‌లో పంజాబ్‌కు షాకిచ్చినట్టే.. చెన్నైకి ఝలక్ ఇచ్చేందుకు  వార్నర్ సేన రెడీ అయింది. పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ సందర్భంగా వార్నర్ కూడా తాము వచ్చే సీజన్ కు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామని, ఒత్తిడి లేకుండా ఆడుతున్నామని చెప్పాడు.  అందుకే గత మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఏకంగా 213 పరుగుల భారీ స్కోరు చేశారు. ఈ సీజన్‌‌లో ఢిల్లీకి ఇదే బెస్ట్ స్కోరు.  ఇదే జోష్ చెన్నైతో మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తే తమిళ తంబీలకు తిప్పలు తప్పవు. 


ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, ప్రియమ్ గార్గ్, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్


చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, మొహమ్మద్