GT vs CSK Live: ఐపీఎల్ - 16 ఆఖరి దశకు చేరింది.   నేటి నుంచే  ప్లేఆఫ్స్ షెడ్యూల్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫస్ట్  క్వాలిఫయర్ జరుగనుంది.  ఈ మ్యాచ్‌లో  టాస్ గెలిచిన  గుజరాత్ టైటాన్స్ మొదలు బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.  


గెలిచిన జట్టు ఫైనల్‌కు..


డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని  గుజరాత్ టైటాన్స్‌కు ఇది వరుసగా రెండో  ప్లేఆఫ్స్ కాగా మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు  ఇది 14 సీజన్లలో 12వ ప్లేఆఫ్స్.  ఈ రెండు జట్ల మధ్య  ఇప్పటివరకు ఈ సీజన్‌లో  3 మ్యాచ్‌లు జరుగగా  మూడుసార్లు  గుజరాత్ టైటాన్స్‌దే విజయం. మరి ఈసారైనా ధోనీ సేన లెక్క సరిచేస్తుందో లేదో చూడాలి.  


ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం.  చెపాక్‌లో గెలిచిన విజేత నేరుగా  మే 28  (ఆదివారం) జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన  జట్టు  మే 24న ఎలిమినేటర్  (లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్)  మ్యాచ్ విజేతతో  మే 26న  రెండో క్వాలిఫయర్ ఆడనుంది.  అయితే గత సీజన్‌లో  పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచి ఈసారి  అత్యద్భుత ఆటతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన  సీఎస్కే..  తాలా(ధోని)‌కు   విజయంతో ట్రీట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.   ఇక ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా పది విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన  గుజరాత్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు.  ఆ జట్టులో అందరూ  ఆపద్భాంధవులే.  


జీటీ బౌలింగ్ వర్సెస్  సీఎస్కే బ్యాటింగ్.. 


చెపాక్ పిచ్ కామన్‌గానే  స్పిన్‌కు అనుకూలం. ఛేదనలో  బంతి మరింత స్లో అయ్యే  ఈ పిచ్ గురించి ధోనికి అణువణువూ ఐడియా ఉంది.  కానీ జీటీకి రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ల రూపంలో  స్టార్ స్పిన్నర్లున్నారు.  స్లోపిచ్‌లపై చెలరేగే మోహిత్ శర్మ  కూడా ఆ జట్టు సొంతం. ఈ నేపథ్యంలో  జీటీ బౌలింగ్ వర్సెస్ చెన్నై బ్యాటింగ్ మధ్య రసవత్తర పోరు జరుగనుంది. 


 






తుది జట్లు : 


చెన్నై సూపర్ కింగ్స్ :  రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే,  అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా,  ఎంఎస్ ధోని,  దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే,  మహీశ్ తీక్షణ 


గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా,   శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా,  రషీద్ ఖాన్, దర్శన్ నల్కండె, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ,  మోహిత్ శర్మ