Rohit Vs Kohli: న్యూ ఇయర్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఆశలతో 2025 నూతన సంవత్సరానికి ప్రజలంతా వెల్కమ్ చెప్పేశారు. తాజాగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కూడా న్యూ ఇయర్ కి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఆకర్షణీయంగా తయారై న్యూ ఇయర్ పార్టీకి హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కోహ్లీ దంపతులు సూపర్ స్మార్ట్ గా ఉన్నారని అభిమానులు సంబరపడుతూ, లైకులు, కామెంట్లతో పోస్టును షేర్ చేస్తున్నారు. అయితే వీరితోపాటు టీమిండియా ప్లేయర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదో టెస్టు కోసం సిడ్నీకి భారత జట్టు చేరుకుంది. ఈ క్రమంలోనే సిడ్నీలోనే జరిగిన ఒక పార్టీకి వీరంతా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక కీలకమైన మెల్ బోర్న్ టెస్టులో ఓడిపోయిన తర్వాత కోహ్లీ ఇలా పార్టీ చేసుకోవడం తగదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. 






రోహిత్ తో కోహ్లీని పోల్చకండి..
మరోవైపు ఇటీవల తరచూ విఫలమవుతున్న కోహ్లీని భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పోల్చవద్దని మాజీ క్రికెటర్ కమ్ కామేంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ తనదైన ముద్ర వేశాడని, అతనో గొప్ప బ్యాటరని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ తనదైన శైలిలో రాణించాడని, అలాంటిది కొంతకాలంగా విఫలమైనంత మాత్రాన కోహ్లీ సాధించిన ఘనతలను మరిచి పోరాదని పేర్కొన్నాడు. బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గానూ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడని, పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడని వ్యాఖ్యానించాడు. దీంతో టెస్టు క్రికెట్లో రోహిత్, కోహ్లీ కొనసాగడంపై చర్చ కొత్త మలుపు తీసుకుంది. 


పదివేల పరుగులకు చేరువలో కోహ్లీ..
ఇప్పటికే వన్డేల్లో 12వేల పరుగులకు పైగా చేసిన 36 ఏళ్ల కోహ్లీ.. టెస్టుల్లో పదివేల మార్కును అందుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. తన కెరీర్లో 122 మ్యాచ్ లాడిన కోహ్లీ, 9207 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. అలాగే కోహ్లీ హయాంలోనే తొలిసారిగా ఆసీస్ ను ఆసీస్ గడ్డపై ఓడించి, టెస్టు సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. మరోవైపు సిడ్నీలో ఈనెల 3 నుంచి జరిగే ఐదో టెస్టులో సత్తా చాటి విమర్శకుల నోరు మూయించాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇక ఆలస్యంగా టెస్టుల్లోకి వచ్చిన 37 ఏళ్ల రోహిత్.. ఇప్పటివరకు 67 టెస్టులాడాడు. ఇందులో 4302 పరుగులు సాధించాడు. - సెంచరీలు ఉన్నాయి. అయితే అమోఘమైన లిమిటెడ్ ఓవర్ల కెరీర్ కారణంగా టెస్టుల్లో రోహిత్ కు అంతగా పేరు రాలేదు. 


ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ లో నాలుగు టెస్టులు ముగిసేటప్పటికీ, ఏడు ఇన్నింగ్స్ లు కలిపి కేవలం 31 పరుగలు మాత్రమే రోహిత్ చేశాడు. అతని సగటు 6.20 కావడం గమనార్హం. దీంతో ఆసీస్ పర్యటనలో అత్యంత చెత్త సగటును నమోదు చేసిన వరస్ట్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. 


Also Read: Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం