India vs New Zealand Semi Final Match Live Streaming : ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం భారత్-న్యూజిలాండ్(India vs New Zealand)మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబై (Mumbai)లోని వాంఖడే మైదానం( Wankhede Stadium)లో జరిగే ఈ మ్యాచ్‌ను చూసేందుకు మాజీ దిగ్గజ క్రికెటర్లు తరలివస్తున్నారు. ఇప్పటికే వీఐపీ గ్యాలరీలో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సెమీస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంగ్లండ్ మాజీ స్టార్ ఫుట్‌బాల‌్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హమ్ కూడా వాంఖడేకు రానున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ను టీవీలో.. మీ ఫోన్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలంటే...
మ్యాచ్ ప్రారంభం ఎప్పుడు?
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది.
ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లలో ఎలా చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ టీమిండియా-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ (SD+HD), స్టార్ స్పోర్ట్స్ 1 (HD+HD), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 2 (HD+SD) ఛానల్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ ఉంటుంది.
ఉచితంగా ఎలా చూడాలంటే?
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లలో ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూసేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్క్రీన్లు
క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గత ప్రపంకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్‌కు ఏపీలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. ఒక్కో చోట సుమారు 10వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్క్రీన్లపై మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీలు మ్యాచ్‌ను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
కసితో రోహిత్ సేన
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ మహా సంగ్రామానికి సిద్ధమైంది. గత ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లి కన్నీళ్లకు కారణమైన న్యూజిలాండ్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్ సెమీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఓసారి ప్రతీకారం తీర్చుకుంది. కానీ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా రోహిత్ సేన... ఇక న్యూజిలాండ్‌పై విజయం సాధించడం
ఒక్కటే మిగిలింది.