IND vs NZ, 1st T20 Live Streaming: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 ముగిసింది. ఈ మెగా టోర్నీలో సెమీసుల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ ఇప్పుడు టీ20, వన్డే సిరీసుల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే కివీస్‌ చేరుకున్న యువ భారత్‌ కఠోరంగా సాధన చేస్తోంది. శుక్రవారం తొలి టీ20లో ఆతిథ్య జట్టును ఢీకొంటోంది. మరి ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్ల వివరాలు మీ కోసం!


భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ టైమింగ్‌, వేదిక ఏంటి?


భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20 వేదిక వెల్లింగ్టన్‌. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అరగంట ముందు టాస్‌ వేస్తారు. 


భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20ని ఎక్కడ చూడొచ్చు?


ప్రైవేట్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ఈ పర్యటన హక్కులను దక్కించుకోలేదు. స్టార్‌స్పోర్ట్స్‌, సోనీ ఛానళ్లలో ఈ మ్యాచులు ప్రసారం కావు. దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో (Doordarshan Sports) మాత్రమే లైవ్‌ టెలికాస్ట్‌ చూసేందుకు వీలుంది.


భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎందులో?


భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో (Amazon Prime) అందుబాటులో ఉంది. తొలిసారిగా ప్రైమ్‌ ఈ హక్కులను దక్కించుకుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను ప్రకటించింది.


భారత్, న్యూజిలాండ్‌ టీ20, వన్డే సిరీసుల షెడ్యూలు


తొలి టీ20 - నవంబర్‌ 18, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక వెల్లింగ్టన్‌
రెండో టీ20 - నవంబర్‌ 20, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక మౌంట్‌ మాంగనూయ్‌
మూడో టీ20 - నవంబర్‌ 22, మధ్యాహ్నం 12 గంటలకు, వేదిక నేపియర్‌
తొలి వన్డే - నవంబర్‌ 25, ఉదయం 7 గంటలకు, వేదిక ఆక్లాండ్‌
రెండో వన్డే - నవంబర్‌ 27, ఉదయం 7 గంటలకు, వేదిక హ్యామిల్టన్‌
మూడో వన్డే - నవంబర్‌ 30, ఉదయం 7 గంటలకు, వేదిక క్రైస్ట్‌ చర్చ్‌


న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్లు (India vs New Zealand T20 ProbableXI)


భారత్‌ టీ20 జట్టు: హార్దిక్‌ పాండ్య (C), శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్ మాలిక్‌


భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్‌ (C), శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌