భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, కగిసో రబడ ఉన్నారు. వీరు ఐదుగురు ఒకే వీడియోలో తమ శుభాకాంక్షలను తెలిపారు. అయితే ఆ వీడియోను ఫాఫ్ డుఫ్లెసిస్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ ఆరుగురు క్రికెటర్లకు ఐపీఎల్ కారణంగా మనదేశంలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ క్రికెటర్లు కాగా, కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ దేశస్తుడు. ఏబీ డివిలయర్స్, కగిసో రబడ, ఫాఫ్ డుఫ్లెసిస్ దక్షిణాఫ్రికాకు తరఫున ఆడతారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికి వస్తే... రాజస్తాన్ రాయల్స్‌కు జోస్ బట్లర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కేన్ విలియమ్సన్, పంజాబ్ కింగ్స్‌కు జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుఫ్లెసిస్ ఆడుతున్నాడు. ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.
‘75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి శుభాకాంక్షలు. మాకు మా దేశం తర్వాత ప్రత్యేకమైన దేశం మీది. #75NotOut కు మా అందరి తరఫున శుభాకాంక్షలు.’ అని ఆ వీడియో పైన క్యాప్షన్ ఉంచారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది.