IND Vs WI, 3rd ODI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న  భారత క్రికెట్ జట్టు నేడు వన్డే  సిరీస్‌లో విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆడుతోంది.  ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో  జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు  వన్డే సిరీస్‌ను గెలుచుకోనుంది. నేటి మ్యాచ్‌లో షై హోప్ సారథ్యంలోని వెస్టిండీస్  జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు రానుంది. 


రెండో వన్డేలో ప్రయోగాలు చేసిన  టీమిండియా.. కీలకమైన మూడో వన్డేలో కూడా అదే బాట పట్టింది.  నేటి మ్యాచ్‌లో కూడా  టీమిండియా స్టార్ ఆటగాళ్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం లేదు. ఈ మ్యాచ్‌లో కూడా ఆ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చింది టీమిండియా. ఇక   నేటి మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్,  అక్షర్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ ఆడుతున్నాడు. విండీస్ జట్టులో  మార్పులేమీ లేవు. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే  వెస్టిండీస్ ఆడుతోంది. 


తొలి వన్డేలో ఈజీగా గెలిచిన టీమిండియా రెండో వన్డేలో  దారుణంగా ఓడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినివ్వడంతో  భారత బ్యాటింగ్ లైనప్ దారుణంగా  కుప్పకూలింది.  నేటి మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు అత్యంత కీలకం.  వన్డే వరల్డ్ కప్‌లో  ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా..  అసలు ప్రపంచకప్‌కు క్వాలిఫై కాలేకపోయి చతికిలపడ్డ విండీస్ చేతిలో ఓడితే  దాని ప్రభావం రాబోయే ఆసియా కప్ మీద కూడా పడే అవకాశాలు లేకపోలేదు. 


టెస్టు సిరీస్‌లో విండీస్‌ను ఆటాడుకున్నట్టే  వన్డేలలో కూడా  కరేబియన్లను ఈజీగా లొంగదీస్తారనుకుంటే  భారత  కుర్రాళ్లు మాత్రం బొక్క బోర్లా పడ్డారు. రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్‌కు ఓటమి తప్పలేదు.  దీంతో నేటి మ్యాచ్‌ కీలకంగా మారింది. 2006 తర్వాత భారత జట్టు  వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ కోల్పోలేదు.  వరుసగా 11 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది.  నేటి మ్యాచ్‌‌లో ఓడితే మాత్రం ఆ రికార్డు గోవిందా గోవిందా.. 


 






తుది జట్లు: 


వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజ్, షై హోప్ (కెప్టెన్), షిమ్రన్ హెట్‌మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్


భారత్ : శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial