Ashwin breaks Kapil Dev record 435 Test wickets: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. లంక రెండో ఇన్నింగ్స్ లో 36వ ఓవర్ మూడో బంతికి చరిత్ అసలంక వికెట్ అశ్విన్ కెరీర్ లో 435వ టెస్ట్ వికెట్. తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.
కపిల్ దేవ్ టెస్టుల్లో 434 వికెట్లతో మూడో స్థానానికి పడిపోయారు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్. అంతకుముందు ఇదే ఇన్నింగ్స్‌లో లహిరు తిరుమన్నేని డకౌట్ చేసిన అశ్విన్, నిస్సంక వికెట్ తీయడం ద్వారా కపిల్‌దేవ్ అత్యధిక టెస్టు వికెట్ల రికార్డును సమం చేశాడు. కపిల్ రికార్డును అధిగమించిన అశ్విన్‌ను సచిన్ టెండూల్కర్ అభినందించాడు. కపిల్ రికార్డును అధిగమించడం కచ్చితంగా ఓ గొప్ప ఘనత అని, మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని అశ్విన్‌కు విషెస్ తెలిపాడు సచిన్.
అశ్విన్ అతివేగంగా ఫీట్.. (Ashwin breaks Kapil Dev record)
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కేవలం 85వ టెస్టులోనే 435 వికెట్ల మైలురాయిని చేరుకోగా, కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు సాధించారు. హర్బజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు, ఇషాంత్ శర్మ 105 టెస్టుల్లో 311 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు.
టీమిండియా టాప్ 5 వికెట్ టేకర్స్..
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు
అశ్విన్ 85వ టెస్టులోనే 435 వికెట్లు
కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు
హర్బజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు
ఇషాంత్ శర్మ 105 టెస్టుల్లో 311 వికెట్లు
మ్యాచ్ ఇన్నింగ్స్ వివరాలు..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 వద్ద డిక్లేర్ చేసింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 174కు ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ప్రస్తుతానికి 139/7 (46.3 ఓవర్లలో)
Also Read: IND vs SL 1st Test: జడేజా స్పిన్‌కు లంక దాసోహం - తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కుప్పకూలిన లంకేయులు
Also Read: Ravindra Jadeja: ఆ నిర్ణయం నాదే - జడేజా షాకింగ్ కామెంట్స్!