IND VS SL Galle Test, Chateshwar Pujara Demands Brave Target Declaration:  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్ట్ ఇండియాకు తప్పక గెలవాల్సిన మ్యాచ్ గా మారింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా, ఫైనల్ చేరాలంటే మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఆరు నుంచి ఏడు మ్యాచ్ లు గెలవాలి. తొలి టెస్టులో ఇండియా 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పటిష్ట స్థితిలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచి ఉండటంతో సమయం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో భారత మాజీ బ్యాటర్ ఛటేశ్వర్ పూజారా మాట్లాడుతూ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన బోల్డ్ డెసిషన్ తీసుకుని త్వరగా డిక్లేర్ చేయాలని పేర్కొన్నాడు.

Continues below advertisement

Read Also: Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

90 నుంచి 100 ఓవర్ల టైమ్.. పూజారా కీలక సూచనలుతాజాగా మాట్లాడిన పూజారా, ఇండియా దూకుడు వ్యూహాన్ని అమలు చేయాలని సూచించాడు. "ఇండియా తమ ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చాటిచెప్పాలి. టెస్ట్ మ్యాచ్ లో ఎక్కువ సమయం మిగిలి లేదు. వర్ష సూచనను దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని విస్మరించలేం. డబ్ల్యూటీసీ ఫైనల్ కు క్వాలిఫై కావాలంటే ఈ రెండు టెస్టులను గెలవాల్సిందే. అందుకోసం కాస్త సాహసం, మరింత దూకుడు ప్రదర్శించాలి. బౌలర్లకు లంక 10 వికెట్లు పడగొట్టేందుకు కనీసం 90 నుంచి 100 ఓవర్ల సమయం ఇవ్వాలి. అందుకే 350 నుంచి 375 రన్స్ టార్గెట్ సెట్ చేసి డిక్లేర్ చేయడం బెస్ట్. ఒకవేళ శ్రీలంక ఆ టార్గెట్ చేజ్ చేసినా క్రెడిట్ వాళ్లకే దక్కుతుంది, కానీ ఇండియా మాత్రం సాహసం చేయక తప్పదు" అని విశ్లేషించాడు.

Continues below advertisement

Read Also: Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..

గాలేలో 178 రన్స్ లీడ్.. రెండో ఇన్నింగ్స్ పైనే దృష్టితొలి ఇన్నింగ్స్ లో ఇండియా చేసిన 462 పరుగులకు బదులుగా శ్రీలంక 284 రన్స్ మాత్రమే చేయడంతో గిల్ సేనకు 178 పరుగుల భారీ లీడ్ లభించింది. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించి శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. క‌డ‌ప‌టి వార్త‌లందేస‌రికి 16 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 72 ప‌రుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (35), యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. క్రీజులో దేవదత్ పడిక్కల్ (29 బ్యాటింగ్), కెప్టెన్ శుభమాన్ గిల్ (1 బ్యాటింగ్) ఉన్నారు.  ప్ర‌స్తుతం ఓవ‌రాల్ లీడ్ 254 ప‌రుగులకు చేరింది.  వాతావరణం అనుకూలిస్తే భారత బౌలర్లు లంక రెండో ఇన్నింగ్స్ ను త్వరగా కట్టడి చేసి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సొనాల్ దినుష తొలి సెంచరీ.. లంక 284 పరుగులకు ఆలౌట్మూడో రోజు ఆటలో శ్రీలంక తరఫున యువ బ్యాటర్ సొనాల్ దినుష తొలి టెస్ట్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (80) తో కలిసి దినుష ఆరో వికెట్‌కు 146 రన్స్ జోడించి భారత బౌలర్లకు కాసేపు అడ్డుగోడగా నిలిచాడు. అయితే పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 62వ ఓవర్లో డిక్వెల్లాను అవుట్ చేసి ఈ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు మానవ్ సుతార్ 4/76, రవీంద్ర జడేజా 3/57 బౌలింగ్ తో శ్రీలంకను 284 పరుగులకు ఆలౌట్ చేశారు.