Shubman Gill Flying Catch Marvel, IND VS SL Galle Test Updates: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలుత శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా, ఆ తర్వాత భారత సారథి శుభమాన్ గిల్ అద్భుతమైన క్యాచ్ లతో అలరించారు. ముఖ్యంగా మూడో రోజు ఆటలో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్స్‌ట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్, గాల్లోకి ఎగురుతూ ఎడమవైపునకు డైవ్ చేసి పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసిన కామెంటేటర్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
గాల్లోకి లేచిన గిల్.. కమిందు మెండిస్ ఔట్ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ బంతిని లంక బ్యాటర్ కమిందు మెండిస్ ముందుకు వచ్చి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేవడంతో చాలా మంది ఫీల్డర్లు బంతిని కేవలం ఆపడానికే ట్రై చేసే పరిస్థితి ఉంది. కానీ గిల్ మాత్రం అద్భుతమైన రిఫ్లెక్స్ ప్రదర్శిస్తూ గాల్లోకి డైవ్ చేసి బంతి నేలను తాకే లోపే ఒంటిచేత్తో గట్టిగా ఒడిసిపట్టాడు. క్యాచ్ పట్టిన తర్వాత బంతిని పైకి విసిరేసి గిల్ సంబరాలు చేసుకున్నాడు.
సంజయ్ మంజ్రేకర్ కాంప్లిమెంట్స్.. అసాధ్యమైన క్యాచ్ గా వర్ణనఈ క్యాచ్ పై లైవ్ కామెంట్రీలో ఉన్న భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. "వావ్, ఆ క్యాచ్ ను అలా పట్టడం నిజంగా అసాధ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆ బంతి అతడి రీచ్ లో అస్సలు లేదు. బ్యాటర్ కూడా బంతి గాల్లో ఉన్నా ఫీల్డర్ కు చాలా దూరంగా ఉందని అనుకుని ఉంటాడు. ఎక్స్‌ట్రా కవర్ ఏరియాలో మీరు చూసే బెస్ట్ క్యాచ్ లలో ఇది కచ్చితంగా ఒకటి" అని కొనియాడాడు.
ధనంజయ సూపర్ క్యాచ్.. జురెల్ వికెట్ హైలైట్ఇంతకుముందు రెండో రోజు ఆటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా ఇదే తరహా అద్భుతమైన క్యాచ్ తో మెరిశాడు. ప్రభాత్ జయసూర్య వేసిన ఇన్నింగ్స్, 110వ ఓవర్లోని ఒక బంతిని డిఫెన్స్ చేయబోయిన భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఎడ్జ్ తీసుకోగా, ఫస్ట్ స్లిప్ లో ఉన్న లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఒక చేత్తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు ఆటలో 51 పరుగులు చేసిన జురెల్ ఆ క్యాచ్ తో వెనుదిరిగాడు. పడిక్కల్ 167 రన్స్, రాహుల్ 82 రన్స్ చేయడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు లంక 284 పరుగులకు ఆలౌటవగా, ఇండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
