Galle Test Updates, Indian Spinners Demolish Lanka:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సోమ‌వారం మూడో రోజు ఆటలో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్న‌ర్లు మాయాజాలం ప్ర‌ద‌ర్శిచ‌డంతో లంకను 79.4 ఓవర్లలో 284 పరుగులకే ఆలౌట్ చేశారు. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సోనాల్ దినుష స్ట‌న్నింగ్ సెంచ‌రీ (168 బంతుల్లో 100, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో మాన‌వ్ సుతార్ కు నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అంత‌కుముందు మూడో రోజు ఆట ప్రారంభమైన నాలుగు బంతుల్లోనే ఇండియా తొలి ఇన్నింగ్స్ 462 పరుగుల వద్ద ముగిసింది. అయితే ఆ ఆనందం ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఎంతోసేపు నిలవలేదు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే వికెట్ తీయగా, ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగి మ్యాచ్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.

Continues below advertisement

Continues below advertisement

మానవ్ సుతార్ ఫస్ట్ బాల్ మ్యాజిక్.. కుప్పకూలిన లంక టాప్ ఆర్డర్ యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన తొలి బంతికే లంక సీనియర్ బ్యాటర్ దినేష్ చండిమాల్ ను అవుట్ చేసి మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక మిడిలార్డర్ కాసేపు ప్రతిఘటించినా భారత స్పిన్ త్రయం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ వరుసగా ఒత్తిడి పెంచారు. దాంతో లంక స్కోరు 27/1 నుంచి 59/4 కి పడిపోయింది. లంచ్ సమయానికి జడేజా మరో కీలక వికెట్ తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు.

284 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. భారీగా పెరిగిన వర్షంఆ తర్వాత సెషన్లలో శ్రీలంక బ్యాటర్లు కాస్త పోరాడినప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో లంకను చాలా త్వ‌ర‌గానే ఆలౌట్ చేశారు. ఆఖరి వికెట్ స్టంపింగ్ తో ముగియడంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మిగ‌తా బౌల‌ర్లలో వెట‌ర‌న్ ర‌వీంద్ర జ‌డేజాకు మూడు, మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిధ్ కృష్ణ‌, కుల్దీప్ యాద‌వ్ కు త‌లో వికెట్ ద‌క్కింది.  ఆ వెంటనే మైదానంలో భారీ వర్షం మొదలవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో కమ్ముకోవడంతో గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్ ను కప్పివేశారు.

నాల్గో రోజు ఉదయమే ఆట షురూ.. ఉదయం 9:45 గంటలకు ఫస్ట్ బాల్వర్షం కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు నాల్గో రోజు ఆటను కాస్త ముందుగానే ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:45 గంటలకు తొలి బంతి పడనుంది. భారీ ఆధిక్యంతో ఉన్న టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు జోడించి శ్రీలంక ముందు భారీ టార్గెట్ ఉంచేందుకు వ్యూహాలు రచిస్తోంది.