భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్ టాస్ వేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్ రిషభ్ పంత్ వరుసగా మూడో మ్యాచులోనూ టాస్ ఓడిపోయాడు. ఫలితంగా ముందుగానే బ్యాటింగ్‌కు రావాల్సి వస్తోంది. విశాఖలో ఇప్పటి వరకు జరిగిన రెండు అంతర్జాతీయ టీ20ల్లో ఛేదన జట్టే గెలవడం గమనార్హం.
IND vs SA 3rd T20 Playing XI
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: రెజా హెండ్రిక్స్ తెంబా బవుమా, వాండర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, డ్వేన్ ప్రిటోరియస్, వేన్ పర్నెల్, రబాడా, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోకియా, తబ్రైజ్ శంషి
ఇదీ సంగతి
అంతర్జాతీయ క్రికెట్లో భారత గడ్డపై ఏ జట్టు అడుగుపెట్టినా భయపడుతుంది! ఒక్క దక్షిణాఫ్రికా తప్ప! అవును, మీరు చదువుతున్న స్టేట్‌మెంట్ కరెక్టే! 12 ఏళ్లుగా సఫారీలకు టీమ్‌ఇండియాపై తిరుగేలేదు. తాజాగా మరో సిరీస్‌ను బుట్టలో వేసుకొనేందుకు వారు రెడీగా ఉన్నారు. విశాఖలో జరిగే మూడో టీ20 గెలిస్తే చాలు. 3-0తో సిరీస్ ఎగరేసుకుపోతారు. మరి సఫారీల జోరును పంత్ సేన అడ్డుకోగలదా? తిరిగి మూమెంటమ్ అందుకోగలదా? అంటే మ్యాచ్ ముగిసేంత వరకు ఎదురు చూడాల్సిందే.
విశాఖలో డేంజరే!
ఐదు టీ20ల సిరీసులో దక్షిణాఫ్రికా 2-0తో పైచేయి సాధించింది. ఇప్పుడు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచుకు సిద్ధమైంది. విశాఖ తీరాన జరిగే ఈ మ్యాచ్ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. పిచ్, వాతావరణ పరిస్థితులు మాత్రం పంత్ సేనకు అనుకూలంగా లేవు. ఇప్పటి వరకు ఇక్కడ రెండే టీ20ల జరిగితే రెండూ లో స్కోరింగ్ గేమ్సే! రెండింట్లోనూ ఛేదన జట్టే గెలిచింది. 2016లో లంకేయులను 82కే కట్టడి చేసిన భారత్ 14 ఓవర్లకే విజయం అందుకుంది. 2019లో టీమ్‌ఇండియాను 126/7కు నియంత్రించిన ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపు తలుపు తట్టింది. స్పిన్నర్లు, పేసర్లకు పిచ్ సహకరిస్తుంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉక్కపోత ఎక్కువ కాబట్టి రెండో ఇన్నింగ్‌లో బంతిపై పట్టు చిక్కదు. అంటే టాస్ గెలిస్తే దాదాపుగా మ్యాచ్ గెలిచినట్టే!