IND vs PAK Asia Cup 2025 Final | దుబాయ్: ఆసియా కప్ 2025 ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 41 ఏళ్ల తరువాత ఆసియా కప్ ఫైనల్లో తొలిసారి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తరువాత ఓ ఫైనల్లో పాక్ జట్టుపై భారత్ విజయం సాధించలేదు. 

Continues below advertisement


ఇండియా XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా.


పాకిస్తాన్ XI: ఫర్హాన్, ఫకర్ జమాన్, అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హెచ్ తలత్, ఎం. హరిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఎఫ్. అష్రఫ్, ఎ. అహ్మద్, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ 






ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటికే 2 సార్లు పాకిస్థాన్‌ను ఓడించింది, భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి విజయాలు సొంతం చేసుకుంది. ఫైనల్లోనూ పాక్ ను చిత్తుచేసి మరోసారి ఆసియా కప్ విజేతగా నిలవాలని భావిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ మళ్ళీ డాషింగ్ ఇన్నింగ్స్ ఆడితే మెన్ ఇన్ బ్లూ విజయంతో అజేయంగా ఆసియా కప్ ప్రస్థానాన్ని ముగిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 


T20I లలో ముఖాముఖీ
2 జట్ల మధ్య జరిగిన 15 మ్యాచ్‌లలో భారత్ 12 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది.


సూర్యకుమార్ యాదవ్ (భారత కెప్టెన్):
"మేం ఫస్ట్ బౌలింగ్ చేస్తాము. పిచ్ బాగుంది. వెలుతురులో మరింత మెరుగ్గా ఆడాలనుకుంటున్నాం. ఈ రోజు మేం చేజింగ్ చేయాలని భావిస్తున్నాం. పిచ్ కాస్త గట్టిగా కనిపిస్తుంది. గ్రౌండ్ స్టాఫ్ అద్భుతంగా పనిచేశారు. మెరుగైన క్రికెట్ ఆడటంపై దృష్టి పెట్టాం. ఈ మ్యాచ్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడు. అర్ష్‌దీప్ సింగ్,  హర్షిత్ రాణాలు కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో రింకూ సింగ్, శివం దుబే, బుమ్రాలు జట్టులోకి వచ్చారు."


సల్మాన్ అలీ అఘా (పాకిస్తాన్ కెప్టెన్):
"మేం ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషంగా బరిలోకి దిగుతాం. ఆసియా కప్ ఆడేందుకు వచ్చినప్పటి నుండి అదే మా విధానం. మేం ఇప్పటికీ పూర్తి ప్రదర్శన చేయలేదు. ఈ రోజు బెస్ట్ ఆటతీరుతో ఆకట్టుకుంటాం. మా జట్టులో ఎటువంటి మార్పులు లేవు. మేం అదే జట్టుతో వెళ్తున్నాము" అన్నాడు.