భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ శుక్రవారం జరుగుతోంది. డబ్లిన్‌లోని ది విలేజ్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. రింకూ సింగ్, ప్రసీద్ కృష్ణలు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రింకూ సింగ్ సంచలన ప్రదర్శన కనపరిచాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి రింకూ మ్యాచ్ గెలిపించడం విశేషం. గాయం నుంచి కోలుకున్నాక బుమ్రా బరిలోకి దిగుతున్న మొదటి మ్యాచ్ ఇదే. ప్రపంచకప్ దగ్గర్లోనే ఉంది కాబట్టి అతని ఆటపై అందరి చూపు ఉంది.
దీంతోపాటు భారత్ 2024 టీ20 వరల్డ్ కప్‌కు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఈసారి జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడబోవడం లేదని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే రోహిత్ శర్మ స్థానంలో ఆధారపడదగ్గ ఓపెనర్, విరాట్ కోహ్లీ స్థానంలో వరల్డ్ క్లాస్ వన్‌డౌన్ బ్యాటర్ అవసరం. ముందు ఆ స్థానాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలి. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయనున్నారు. టీమ్ ప్లాన్‌లో ఒక ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఫిక్స్ కాబట్టి ఈ సిరీస్‌లో రాణించిన ఓపెనర్‌కు రెండో స్థానం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ అతని యాటిట్యూడ్‌పై విమర్శలు ఉన్నాయి. 2024 ప్రపంచకప్‌కు హార్దిక్‌నే కెప్టెన్‌గా ఉంటాడా? బుమ్రాకు పగ్గాలు దక్కుతాయా? అనేది కూడా వేచి చూడాలి.
ఐర్లాండ్ తుది జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్
Also Read: విరాట్ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!
Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial