ఆస్ట్రేలియాతో జరుగుతున్న  టీ20 సిరీస్లో భారత బ్యాటర్ల జోరు కొనసాగుతుంది. టీమిండియా బ్యాటర్లు మరోసారి జూలు విదిల్చడంతో కంగారులపై భారత, జట్టు మరోసారి భారీ స్కోరు చేసింది. తొలి టీ20 మ్యాచ్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఈసారి తొలుత బాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. టాప్ ఆర్డర్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీం ఇండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రింకూ సింగ్ చివర్లో చెలరేగిపోయాడు. భారీ షాట్ లతో మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను.. బాటింగ్ కు ఆహ్వానించింది. ఇది ఎంత తప్పుదు నిర్ణయమో కంగారులకు పవర్ ప్లే లోనే అర్ధం అయింది.


టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. యశస్వి జైస్వాల్... భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం ఆరు ఓవర్ లలో 77 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జైస్వాల్ 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాదు.  జైస్వాల్ ని ఇంగ్లీష్ అవుట్ చేశాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తో ఇషాన్ కిషన్ జత కలిసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.  కేవలం 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 164 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్... రుతురాజ్ తో కలిసి మరోసారి మెరుపు బాటింగ్ చేసాడు. కేవలం 10 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి సూర్య అవుట్ అయ్యాడు. దీంతో 189 పరుగుల వద్ద భరత్ మూడో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ రాకతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీం ఇండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.


రింకూ సింగ్ కేవలం 9 బంతుల్లో 4 ఫోర్లు.. 2 సిక్సర్లతో  31 పరుగులు చేసాడు... ఋతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు... రెండు సిక్సర్లతో 58 పెరుగులు చేశాడు. తిలక్ వర్మ 2 బంతుల్లో 7 పరుగులు చేసాడు.  మెుదటి టీ-20 మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన ఆసీస్‌ సిరీస్‌లో  బోణీకొట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన జోష్‌ ఇంగ్లిస్‌తోపాటు సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అవకాశం ఉంది. స్టార్‌ ఆటగాళ్లు మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా ఆసీస్‌ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రెండో టీ-20లో స్పిన్నర్లు జంపా, తన్వీర్‌ సంగాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 5 టీ ట్వంటీల సిరీస్‌లో ఆధిక్యాన్నిన2-0కు పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా...... పరాజయం పాలవ్వడం కంగారులను ఆందోళనకు గురి చేస్తోంది. చివరి బంతి వరకూ పోరాడినా విజయం దక్కకపోవడంపై ఆస్ట్రేలియన్లు ఆందోళనగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సమస్యలను అధిగమించి విజయం సాధించాలని ఆసిస్‌ గట్టి పట్టుదలతో ఉంది.